పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి | facing police harrasments says mudragada padmanabam | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి

Published Sat, Sep 17 2016 7:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి - Sakshi

పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి

‘బాబు’ వియ్యంకునిలా నేను రివాల్వర్‌ వాడను: ముద్రగడ
జగ్గంపేట:
తనపై, తన అనుచరులపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారన్నారు. మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు. తన వియ్యంకుడిని శుక్రవారం రివాల్వర్‌ అప్పగించాలని పోలీసులు కోరారన్నారు. ఆయన రివాల్వర్‌కు, తనకు సంబంధమేమిటని ప్రశ్నించారు.

‘రివాల్వర్‌ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్‌ వాడను’ అన్నారు. ఆయన భార్య రివాల్వర్‌ను కూడా బాలకృష్ణ వాడారన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు లేవని వ్యాఖ్యానించారు. ముద్రగడను సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు తదితరులు కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement