
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌పై కోర్టులో ప్రశ్నల వర్షం కురిసింది. ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో జర్నలిస్ట్ రమణి సహా పలువురు మహిళలు అక్బర్‌పై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం ఆయన రమణిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో శనివారం కోర్టుకు హాజరైన అక్బర్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏషియన్ ఏజ్ పత్రికలో రమణి చేరిక, తదితర అంశాలపై ఆమె తరఫున సీనియర్ లాయర్ అక్బర్‌ను ప్రశ్నించారు.