Ramani
-
వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి..
నెల్లూరు (క్రైమ్)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్రనగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మీంజూరు రైల్వేస్టేషన్లో మృతదేహం సంతపేట ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ సమయంలో తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్స్పెక్టర్కు ఫోన్‌చేసి సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపోలీసుల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పారు. బంగారు ఆభరణాల కోసమే.. గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ట్రావెల్ సూట్‌కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణయించుకుని కుమార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు. చెన్నై మీంజూరు స్టేషన్లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌కేస్‌ను బయట పడేయాలనుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్కడి రైల్వే పోలీసులు విజిల్ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచిపోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వారిని ఆపి సూట్‌కేస్ గురించి ప్రశ్నించగా నీళ్లునమలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్ నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయటపడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్ఫర్ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. -
‘భారత్ జోడో’ యాత్రకు అందరూ కలిసిరావాలి
సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’యాత్ర ఈనెల 24న తెలంగాణలో ప్రవేశించనుందని, దీనికి అందరూ కలసి రా వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, యాత్ర తెలంగాణ పబ్లిసిటీ ఇన్చార్జి రమణి పిలుపునిచ్చారు. దేశంలో కుల, మత తారతమ్యాలతో మనుషుల మధ్య అనైక్యత పెరిగిపోతోందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు. ‘భారత్ జోడో’యాత్ర విజయవంతం కోసం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా విభాగంతో రమణి శుక్రవారం భేటీ అయ్యారు. యాత్ర ముఖ్య ఉద్దేశం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై టీపీసీసీ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశ సంపదను వ్యాపారవేత్తలకు దోచిపెడుతూ, ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, పెరిగిన నిత్యావసరాల ధరలు పేదల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
మా భూమి @ 40
ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత. కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా.. కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్ బ్రేకింగ్’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం. ► కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి. ► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ సలహా మేరకు గౌతమ్ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ► దర్శకుడు గౌతమ్ ఘోష్‌కి ఇదే తొలి సినిమా. ► నవల ఆధారంగా గౌతమ్ ఘోష్ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు. ► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి. ► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’. ► సీఎన్ఎన్– ఐబీఎన్ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది. ► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే. ► లక్షన్నర బడ్జెట్ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది. ► ఈ సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు. ► పాపులర్ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది. ► ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన చిత్రం ఇదే. ► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట. ► సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు. ► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట. ► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు. ► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట. ► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్ జరిపించారు. ► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు. ► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు. ► షూటింగ్స్, సెన్సార్ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట. ► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను వాడిన సినిమా ఇదే. ► యూనిట్ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం. ► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట. భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట. ► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్ చేశారు. ► 1948లో హైదరాబాద్ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు. ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్ సీసా ఖాళీ అయ్యేదట. ► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా. ► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా పని చేశారు. ► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్ తేజ ఆయన కుమారుడే. ► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్ మొత్తం మంగళ్ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట. ► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ► ఈ సినిమా నెగటివ్ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్ చేసి డీవీడీ విడుదల చేశారు. ‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్ సాయిచంద్, రమణి మాభూమి షూటింగ్ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్ – గౌతమ్ మల్లాది -
ఎంజే అక్బర్‌పై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌పై కోర్టులో ప్రశ్నల వర్షం కురిసింది. ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో జర్నలిస్ట్ రమణి సహా పలువురు మహిళలు అక్బర్‌పై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం ఆయన రమణిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో శనివారం కోర్టుకు హాజరైన అక్బర్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏషియన్ ఏజ్ పత్రికలో రమణి చేరిక, తదితర అంశాలపై ఆమె తరఫున సీనియర్ లాయర్ అక్బర్‌ను ప్రశ్నించారు. -
యాక్సిడెంట్
ఉదయం ఆరింటికే సెల్‌ఫోన్ మోగింది.‘ఇంత పొద్దున్నే కాల్ చేసింది ఎవరా?’ అనుకుంటూ చూస్తే ‘రమణి’ పేరు కనిపించింది.‘‘హలో రమణీ! ఏంటే పొద్దున్నే కాల్ చేశావు?’’ అడిగింది విశాల.‘‘విశాలా! శాడ్ న్యూసే’’ అన్నది రమణి.‘‘వాట్?’’‘‘మన స్వప్నకి యాక్సిడెంటయిందంట.’’‘‘ఎప్పుడు?’’‘‘నిన్న సాయంకాలం.’’‘‘ఎలా జరిగింది?’’‘‘మూడో అంతస్తుకు కొత్తగా స్లాబ్ పోశారంట. దానికి పిట్టగోడ లేదంట. ఆరిన బట్టలు తీయడానికి వెళ్లిందంట. పొరపాటున కాలు జారి పడిందట. హాస్పిటల్‌కు తీçుకెళ్లే లోపలే ప్రాణం పోయిందంట.’’రమణి చెప్తున్న మాటలు వింటూనే విశాలకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏడవ సాగింది.‘‘ఊరుకోవే! ఏం చేస్తాం? దానికి అంతవరకే రాసిపెట్టుంది.’’ రమణి ఊరడిస్తోంది.‘‘నేను దాన్ని చూడాలే..!’’ ఏడుస్తూనే అన్నది విశాల. ‘‘విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందట బాడీ. అక్కడ పోస్ట్‌మార్టమ్ చేస్తారంట. యాక్సిడెంట్ కాబట్టి పోస్ట్‌మార్టమ్ చేయాలని పోలీసులు బాడీని తీసుకెళ్లారంట.’’‘‘నాలుగు రోజుల కిందటే చాలాసేపు మాట్లాడిందే నాతో. ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు. నీకు ఎవరు చెప్పారే ఈ విషయం?’’‘‘మా తమ్ముడు పైడిభీమవరంలో ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నాడే! స్వప్న వాళ్లాయన యూనిట్ కూడా అక్కడే ఉందట. రామనారాయణ భార్యకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వీడు వాళ్లింటికి వెళ్లాడట. అది నాకు ఫ్రెండ్ అని తెలుసు కదా! నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. నేను షాక్ తిన్నాను. నిద్రపట్టలేదనుకో. మనం కాలేజీలో గడిపిన రోజులన్నీ కలలోకి వచ్చాయి. రాత్రే నీకు చెప్పాలనుకున్నా కానీ నాలాగే తెల్లార్లూ బాధపడతావని చెప్పలేదు’’ అన్నది రమణి. ‘‘నేను పిల్లల్ని స్కూలుకు పంపించి నీ దగ్గరకు వస్తాను. ఇద్దరం వెళ్దాం’’ అన్నది విశాల.‘‘మనం వెళ్లేసరికి విజయనగరం నుంచి వాళ్ల ఊరికి తీసుకెళ్లి పోతారేమోనే?’’‘‘పైడిభీమవరం వెళ్దాం. విజయనగరం నుంచి ఎంతసేపు? నేను కారు తీసుకొస్తాను.’’‘‘సరే! నేను రెడీగా ఉంటాను’’ అన్నది రమణి.తన క్లోజ్‌ఫ్రెండ్ స్వప్నని తలుచుకుంటూ దుఃఖిస్తుంటే శేఖర్ అడిగాడు.‘‘ఏంటి విశాలా? ఏం జరిగింది?’’ రమణి ఫోన్ చేసి స్వప్న యాక్సిడెంటలో చనిపోయన విషయం చెప్పిందని, విశాల చెప్పింది.‘‘మీరిద్దరూ చాలా క్లోజ్‌ఫ్రెండ్స్ కదూ! వాళ్ల పెళ్లికి మనం దసపల్లా హోటల్‌కి వెళ్లాం. అయిదారేళ్లయింది కదూ?’’‘‘ఏడేళ్లయిందండీ! మన పెళ్లయిన ఏడాది తర్వాత దానికి పెళ్లయింది.’’‘‘పాపం చిన్నవయసు. ఎంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు.’’‘‘బ్యాడ్‌లక్ విశాలా! నువ్వేంటీ వెళ్దామనుకుంటున్నావా?’’‘‘ఔనండీ! డాబా గార్డెన్స్‌లో నా ఫ్రెండ్ రమణి ఉంది కదా! ఇద్దరం కలిసి వెళ్తాం.’’‘‘ఈ టెన్షన్లో కారు నడుపుతావా? వద్దులే! నేను వస్తాలే. పిల్లల్ని రెడీ చెయ్యి. వాళ్లు స్కూలుకు వెళ్లగానే బయల్దేరదాం’’ చెప్పాడు శేఖర్. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ దగ్గర్లో కూర్మన్నపాలెంలో ఉంటున్నారు శేఖర్, విశాల. అతను స్టీల్‌ప్లాంట్‌లో ఇంజనీర్. పదింటికి కూర్మన్నపాలెంలో బయల్దేరి దారిలో డాబా గార్డెన్స్‌లో ఉన్న రమణిని కారులో ఎక్కించుకున్నారు.రమణి గంభీరంగా ఉంది కానీ విశాల మాత్రం డిప్రెషన్లో మునిగిపోయిన దానిలా అయిపోయింది వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. కారుడ్రైవ్ చేస్తున్న శేఖర్, రమణి ఏదొకటి మాట్లాడుతున్నా విశాల పట్టించుకోనట్టు ఉండిపోయింది. కారు విజయనగరం శివారులోకి ప్రవేశించగానే ‘‘కారు ఆపు..!’’ అన్నది విశాల, శేఖర్‌వైపు తీవ్రంగా చూస్తూ. శేఖర్ కారును రోడ్డుపక్కకు ఆపాడు. విశాల డోర్ తీసుకొని రోడ్డు మీద పరిగెత్తుతున్నట్టు వేగంగా నడవ సాగింది. శేఖర్, రమణిలకు ఏమీ అర్థంకావడం లేదు. ఉన్నట్టుండి విశాల వింతగా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోతున్నారు. శేఖర్ పరిగెత్తుకుంటూ వెళ్లి విశాల చెయ్యిపట్టుకుని ఆపాడు.‘‘విశాలా! ఏంటిది? ఎక్కడికి?’’ అన్నాడు అయోమయంగా చూస్తూ.‘‘నేను స్వప్నని. విశాల ఎక్కడుంది? నువ్వెవరు?’’ అన్నది విశాల శేఖర్ని తీవ్రంగా చూస్తూ.పెద్దషాక్ తిన్నట్టయిపోయాడు శేఖర్. ఎందుకో ఆమెను చూస్తే భయం వేసింది. కళ్లు పెద్దది చేసి చూస్తూ పెద్దగా అరుస్తోంది. శేఖర్‌కి ఏం తోచడం లేదు. ఇంతలో రమణి అక్కడికి చేరుకుంది.‘‘విశాలా..?’’ అన్నది.‘‘ఏయ్! కళ్లు పోయాయానే నీకు? నేను స్వప్నని. విశాల అంటావేంటే? ఎక్కడుంది విశాల. ఈయనెవరు?’’ అన్నది శేఖర్ని చూస్తూ.రమణికి పరిస్థితి అర్థమైంది. స్వప్న ఆత్మ విశాలను ఆవహించింది. అందుకే అలా మాట్లాడుతోంది.‘‘సరేనే స్వప్నా! పద.. నడిచి ఎక్కడికి పోతావు? కారెక్కు మీ ఊరు పైడిభీమవరానికి వెళ్దాం’’ అన్నది రమణి.‘‘ఉండు. ఏదైనా బస్సు వస్తే ఎక్కుదాం. ఈయన ఎవరు? మనల్ని కారులో ఎక్కడికి తీసుకెళ్తాడు?’’‘‘ఈయన విశాల వాళ్లాయన. గుర్తుపట్టలా?’’ ‘‘ఎప్పుడో చూశాను. గుర్తుపట్టలా?’’‘‘సరే కారెక్కు’’‘‘అదికాదే రమణీ! ముందు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలి.’’‘‘పోలీస్ స్టేషన్‌కి ఎందుకు?’’ ఆశ్చర్యపోతూ అడిగింది రమణి.‘‘చెప్తానుగా! ఏమండీ ముందు నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లండి’’ అన్నది.‘‘సరే! అలాగే...!’’ అన్నాడు శేఖర్.కారు విజయనగరం పోలీస్ స్టేషన్ ముందు ఆపి, శేఖర్ ముందుగా లోపలకు వెళ్లాడు. జరిగిందంతా చెప్పాడు.. తన భార్య విశాల, ఆమె స్నేహితురాలు స్వప్నలా మాట్లాడుతున్నదనీ, పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లమని ఒత్తిడి చేసిందనీ చెప్పాడు. ఇన్స్పెక్టర్కు ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో ఆత్మలు ఆవహించడం ఏమిటి? గమ్మత్తుగా ఉందే అనుకున్నాడు. సరే! ఆమె ఏం చేప్తుందో విందాం అనుకున్నాడు. శేఖర్, విశాల, రమణి... ఇన్స్పెక్టర్ చాంబర్లోకి వెళ్లారు. విశాల ఇన్స్పెక్టర్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శేఖర్ ఆమె పక్కన కూర్చోబోతుండగా విశాల వారించింది.‘‘నేను ఇన్స్పెక్టర్గారితో పర్సనల్‌గా మాట్లాడాలి. మీరిద్దరూ బైటకు వెళ్లండి’’ అన్నది.శేఖర్, రమణి వెళ్లిపోయారు.‘‘ఇన్స్పెక్టర్ గారూ! నా పేరు స్వప్న. మా ఆయన పైడిభీమవరంలో ఇండస్ట్రీ నడుపుతారు. మాది విశాఖపట్నం. నేను పుట్టి పెరిగింది అక్కడే. ఏడేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. రెండో పిల్ల పుట్టినప్పటి నుంచి మా అత్త సత్తెమ్మ నన్ను సతాయించడం మొదలుపెట్టింది. మాకు ఇంత ఆస్తి ఉంది. వారసుడు లేడు. నాకు మనవడు కావాలి. నువ్వు ఇద్దరు ఆడ ముండల్ని కన్నావు. తర్వాత కూడా నీకు ఆడపిల్లలే పుడతారు. మా వాడికి ఇంకొక పెళ్లి చేస్తాను. నువ్వు విడాకులు ఇవ్వు అని తిడుతోంది. మా ఆయన కూడా తల్లికి వంత పాడుతున్నాడు. కానీ నేను విడాకులకు ఒప్పుకోలేదు. దేవుడు ఆడపిల్లల్ని ఇస్తుంటే నేనేం చేసేది? నా తప్పేంటి? అని ఎదురు తిరిగాను. ఈ విషయంలో మా ఆయన నన్ను కొడుతుండేవాడు. ఏదొక రోజున నిన్ను చంపేస్తాను. పీడ విరగడవుతుంది అనేవాడు. సార్! నిన్న సాయంకాలం నేను మేడపైకి వెళ్లాను. లోగడ రెండు అంతస్తుల మేడ ఉంది. దాని మీద మూడో అంతస్తు వేశారు. అక్కడ నేను బట్టలు ఆరేస్తుంటాను. ఆరిన బట్టలు తియ్యడానికి వెళ్లాను. అప్పుడు నా భర్త, అత్త నన్ను పట్టుకొని కిందకు నెట్టారు. దానికి ఇంకా పిట్టగోడ కట్టకపోవడంతో సులభంగా నెట్టేశారు.’’ఆమె వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె చెప్పిన మాటల్లో ఇన్స్పెక్టర్కు క్లూ దొరికింది.‘‘అమ్మాయ్! మీ ఆయన, అత్తను జైలుకు పంపిస్తాను. నువ్వు ఇంటికెళ్లు’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘థ్యాంక్స్! ఇన్స్పెక్టర్ గారూ!’’ అంటూ విష్ చేసి బైటకు నడిచింది విశాల. తర్వాత ఇన్స్పెక్టర్.. స్వప్న భర్త రామనారాయణని, అత్త సత్తెమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. రామనారాయణ అంతా బూటకమని దబాయించాడు. ‘‘మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మీరు కోడల్ని మేడపై నుంచి నెడుతున్నప్పుడు ఒకాయన వీడియో తీశాడు స్మార్ట్‌ఫోన్‌లో. ఎవరూ చూడలేదనుకున్నారు మీరు’’ అని ఇన్స్పెక్టర్ దబాయించేసరికి ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు. విజయనగరం హాస్పిటల్‌కి వెళ్లి స్వప్న మృతదేహాన్ని చూసి విశాల, రమణి, శేఖర్ తిరుగుప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత విశాల, తనకు స్వప్న ఆత్మ ఆవహించినట్టు నాటకం ఆడానని చెప్పింది. ‘‘స్వప్న ఫోన్ చేసినప్పుడు భర్త, అత్త చంపుతామని బెదిరిస్తున్నట్టు చెప్పేది. మేడపై నుంచి పడిందని వినగానే నాకు, అది నిజం కాదనిపించింది. భర్త, అత్త కుట్ర చేసి ఉంటారని అనుమానించాను. నా అనుమానం నిజమైంది’’ అన్నది విశాల. తర్వాత స్వప్న అత్త, భర్తలకు జైలుశిక్ష పడింది. ఉపాయంతో వాళ్ల కుట్రను బైటపెట్టిన విశాలను అంతా అభినందించారు. -
ఊరు వెళ్లి వచ్చేసరికి.. ఇల్లు ఖాళీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా నివాసం ఉండే రమణి అనే మహిళ శనివారం పనిమీద వేరే ఊరికి వెళ్లి ఆదివారం తిరిగి రాగా, చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉంచిన సుమారు రూ.1లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆమె పేర్కొన్నారు. రమణి ఇంటి పక్కనే ఉన్న సాయిబాబ అనే వ్యక్తి ఇంట్లోనూ దొంగలు చోరీకి ప్రయత్నించారు. తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించి సఫలం కాకపోవడంతో వెళ్లిపోయారు. -
మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ
-
మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ
హైదరాబాద్: కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పూర్తి కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సహకారంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమణి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో రమణి మాట్లాడుతూ.. ఈ కౌన్సెలింగ్ పరిశీలించి వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ చేస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రమణి పేర్కొన్నారు. -
‘సిక్స్ టు సిక్స్టీన్’
పిల్లలకు పుస్తక జ్ఞానం సరిపోతుందా? మరి లోకజ్ఞానం సంగతేంటి? ఇల్లు, స్కూలు కాకుండా బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు వారి పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబుగా వెలసిందే ‘సిక్స్ టు సిక్స్టీన్’. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసు పిల్లలకు బయటి ప్రపంచం గురించి బోధించడం ఈ సంస్థ ప్రత్యేకత. పదోతరగతి పిల్లలకు బయట ప్రపంచం గురించి ఎంతవరకూ తెలుసు? అనే అంశంపై రమణి రెండేళ్లపాటు పరిశోధన చేశారు. చాలా విషయాలు తెలియవని తేలింది. వ్యవసాయం గురించి తెలియదు, వాతావరణ కేంద్రం గురించి తెలీదు, ఫొటోగ్రఫీ అంటే తెలీదు, పొటాటో పంట ఎలా ఉంటుందో తెలీదు....వీటి సంగతి పక్కన పెడితే ఒక రెస్టారెంటుకి వెళితే ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఇలాంటి విషయాలు స్కూల్లో నేర్పరు. స్కూల్ లైఫ్ అయ్యాక నేర్పినా నేర్చుకోరు. పిల్లల కోసం ప్రత్యేకంగా పనిచేయాలనుకున్న రమణి మెదడుని ఈ ప్రశ్నలే తొలిచేశాయి. ఓ హెచ్ఆర్ కంపెనీ అధినేత అయిన ఆమె స్కూలు విద్యార్థులకు ఎడ్యుకేషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో సిక్స్ టు సిక్స్టీన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీనికి రమణి పెట్టిన మరో పేరు ఎడ్యుటైన్మెంట్. నెలకోసారి... ‘‘డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఎడ్వంచర్ల వరకూ పిల్లలకు అన్ని విషయాలు తెలయాలన్నది నా ఉద్దేశం. మొదట్లో చాలామంది ‘సమయమొచ్చినపుడు వాళ్లే నేర్చుకుంటారు...దానికి ప్రత్యేకంగా బోధనెందుకు’ అన్నారు. కానీ...ఈ జనరేషన్ పిల్లలకు చదువుకే సమయం సరిపోవడం లేదు...మిగతావాటికి సమయమెక్కడుంటుంది? అందుకే చదువుతోపాటు మిగిలిన జ్ఞానం కూడా వంటబట్టించాలనుకున్నాను. నెలలో రెండో ఆదివారం మా కార్యక్రమం ఉంటుంది. కొన్ని స్కూళ్ల నుంచి ఆసక్తి ఉన్న పిల్లల్ని ఒక్కోసారి ఒక్కోచోటికి తీసుకెళతాం. ఉదాహరణకు...మొన్నీమధ్య వాతావరణ శాఖ దగ్గరికి తీసుకెళ్లి వెదర్ ఎలా ఫోర్కాస్ట్ చేస్తారో చూపించాం. అలాగే నాలుగు నెలల క్రితం టూర్లో పట్టుపురుగు నుంచి సిల్క్‌ని ఎలా సేకరిస్తారో వివరించాం. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఐదు బ్యాచ్‌లుగా విభజించి ఎవరికి ఏం నేర్పించాలో నిర్ణయించుకుని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పటివరకూ నగరంలోని 18 పాఠశాలల్లోని 500 మంది పిల్లలు సిక్స్ టు సిక్స్‌టీన్‌లో చేరారు’’ అని చెప్పారు రమణి. 110 అంశాలపై... గత పదకొండు ఏళ్లలో దాదాపు 110 అంశాలపై పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించారు. వీటిలో సాగర్‌లో పడవ నడపడం, నగర శివార్లలో కొండలెక్కడం, పొలాల్లోకి వెళ్లి పంటలు చూడ్డం వంటి ఆసక్తికరమై అంశాలెన్నో ఉన్నాయి. ‘‘మేం తీసుకెళ్లే ప్రాంతాన్ని బట్టి, అంశాన్ని బట్టి చార్జ్ చేస్తాం. మేం పిల్లల్ని ఏరోప్లేన్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లినపుడు వారు తెలుసుకున్న విషయాలను స్కూల్లో టీచర్లతో చెప్పినప్పుడు ఆయా స్కూల్స్ టీచర్ల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టేబుల్ మ్యానర్స్, డ్రెస్సింగ్ సెన్స్ వంటి విషయాల గురించి నేర్పించినపుడు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడున్న స్టడీ మెటీరియల్ వల్ల టీచర్లకు ఇతర విషయాలు చెప్పే తీరిక లేకుండా పోయింది. అలాగే ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులకు బేసిక్స్ నేర్పించే ఓపిక లేకుండా పోతోంది. ఈ లోటుని మా సిక్స్ టు సిక్స్టీన్ భర్తీ చేయగలుగుతోందని నేను గర్వంగా చెప్పగలను’’ అని వివరించారు రమణి. పన్నెండుమంది సిబ్బందితో వందలమంది విద్యార్థులకు లోకజ్ఞానాన్ని నేర్పిస్తున్న ఈ సంస్థ మరింత వినూత్నంగా పనిచేయాలని కోరుకుందాం. ..:: భువనేశ్వరి