ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా నివాసం ఉండే రమణి అనే మహిళ శనివారం పనిమీద వేరే ఊరికి వెళ్లి ఆదివారం తిరిగి రాగా, చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉంచిన సుమారు రూ.1లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆమె పేర్కొన్నారు. రమణి ఇంటి పక్కనే ఉన్న సాయిబాబ అనే వ్యక్తి ఇంట్లోనూ దొంగలు చోరీకి ప్రయత్నించారు. తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించి సఫలం కాకపోవడంతో వెళ్లిపోయారు.