cross examination
-
కమిషన్ ముందు కథలు చెప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఇంజనీరేనా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? కమిషన్ ముందు కథలు చెబుతున్నారా? బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పక్కదోవ పట్టించడానికి యత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం..’అని కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) శంకర్ నాయక్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా బుధవారం 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, పరీవాహక ప్రాంతంలో వచ్చే వరద ఆధారంగా డిజైన్లు తయారు చేయడమేనని నాయక్ బదులిచ్చారు. దీంతో మీరు ఇంజనీరేనా? డిజైన్ ఫ్లడ్ అంటే కూడా తెలియదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జేఎనీ్టయూలో చదువుకున్నానని, నదిలో వచ్చే వరద ఆధారంగా చేసేదే డిజైన్ ఫ్లడ్ అని ఆయన బదులిచ్చారు. ‘ఏం దాస్తున్నారు? రిటైరయ్యాక కూడా దాచేది ఏముంది? విచారణను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తారా? అని కమిషన్ ఆయనపై మండిపడగా, లేదని శంకర్‌నాయక్ వివరణ ఇచ్చారు. 2016 జనవరి 17న నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ సమరి్పంచిందా? ఆ సమావేశం మినిట్స్‌ను పరిశీలించారా? అన్న ప్రశ్నకు మినిట్స్‌ను చూడలేదని నాయక్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. నీటి లభ్యతను తొలుత ఇక్కడి ఇంజనీర్లే నిర్ధారించాల్సి ఉంటుందని కమిషన్ తప్పుబట్టింది. కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్ని0చినా వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలను పరిశీలించి సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్‌నాయక్ తెలిపారు. బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా, లేదని నాయక్ బదులిచ్చారు. వరద తీవ్రత ఆధారంగా ఎన్ని గేట్లు పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా, బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి? బ్లాకులు కొట్టుకుపోతే పైఅధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు? మౌఖికంగానే సమాచారం ఇస్తారా? అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూరి రామచందర్‌పై కమిషన్ మండిపడింది. పినాకిని అంటే అర్థం తెలుసా? మీ పదవీకాలంలో బరాజ్‌లను ఎన్నిసార్లు సందర్శించారు? నివేదికలు ఏమైనా ఇచ్చారా? అని ఓ అండ్ ఎం విభాగం మాజీ సీఈ జి.రమేశ్‌ను కమిషన్ ప్రశ్నించింది. 2021 జూలైలో ఒక్కసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేశ్ బదులిచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరుకి బదులు అఫిడవిట్లో పినాకిని చంద్రఘోష్ అని రాయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. పినాకిని అంటే అర్థం తెలుసా?, అఫిడవిట్ ప్రారంభంలోనే తప్పులు ఉంటే ఎలా? సంతకం చేయడానికి ముందు అఫిడవిట్ చదువుకోరా? అని నిలదీసింది. అర్జీల్లో అచ్చు తప్పులున్నా న్యాయస్థానాలు కేసులను కొట్టివేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ ఐ.వికల్రార్ కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌ల వైఫల్యానికి హైపవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు. 2–3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్‌లను నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలొచ్చాయన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 49 మంది ఇంజనీర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఇంజనీర్ల వంతు ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతోపాటు కాంట్రాక్టర్లను ప్రశ్నించనుంది. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు. -
బండి సంజయ్‌కు రూ.50 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీరుపై హైకోర్టు అసహనం వ్య క్తం చేసింది. కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో అడ్వొకేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానా విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడాన్ని తప్పుబట్టింది. ఎన్నికల పిటిషన్లో విచారణను ముగిస్తామని హెచ్చరించింది. ఈ నెల 12న హాజరవుతారని ఆయన న్యాయవాది తెలపడంతో.. జరిమానాతో సరిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ సమీప ప్రత్యర్థి బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎ న్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చిల్లకూర్ సుమలత మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల సాక్ష్యాలను నమోదు చేయడంకోసం న్యాయమూర్తి జూన్ లో అడ్వొకేట్ కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి శైలజను నియమించారు. అయితే పార్లమెంట్ సమా వేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినే షన్‌కు నాలుగుసార్లు గైర్హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 6 నెలల జైలు కోర్టు ధిక్కరణ కేసులో విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసిన రత్నారెడ్డి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి వదిలేసినందుకు కమిషనర్ సత్యబాబుకు శిక్ష విధిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021, అక్టోబర్ 27 నాటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసినా చర్యలు లేవంటూ వీరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించారు. మంచిరేవుల గ్రామంలోని రెండు ఎకరాలను విశ్వభారతి లీజుకు తీసుకుని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. నిర్దిష్ట గడువులోగా అనుమతులు రాకపోవడంతో చట్ట ప్రకారం వచ్చినట్లుగా భావించి నిర్మాణాలు చేపట్టింది. మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయడంతో రత్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతులు ఇవ్వనందున నిర్మాణాలు చేపట్టినట్లుగా పిటిషనర్ సమాచారం ఇవ్వలేదని తప్పుపట్టింది. హెచ్ఎండీఏ నోటీసుల్ని పిటిషనర్ సవాల్ చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు కాగా, ఇటీవల పైవిధంగా తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: ఓవైపు పోలీసుల సమీక్ష.. మరోవైపు దొంగల చేతివాటం! -
క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఇతరులను అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘ధర్మపురి ఎన్నికల’కేసులో జగిత్యాల జిల్లా రిటర్నింగ్ అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇతరుల(థర్డ్ పార్టీ)ను అనుమతించవద్దని సాక్షుల నమోదు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఈసీ సమర్పించిన నివేదిక ప్రతిని అడ్లూరి లక్ష్మణ్‌కూ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అడ్లూరి లక్ష్మణ్ వేసిన మధ్యంతర అప్లికేషన్లను అనుమతించింది. 2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని సవాల్ చేస్తూ ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో ఎల క్షన్ పిటిషన్ దాఖలు చేశారు. రీకౌంటింగ్‌కు ఉత్తర్వు లు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు.. సాక్ష్యాల రికార్డు కోసం హైకోర్టు మా జీ న్యాయమూర్తి ఎన్వీవీ నాతారెడ్డిని కమిషనర్‌గా నియమించింది. రిటర్నింగ్ అధికారి భిక్షపతి నుంచి సమాచారం సేకరించకుండానే నాతారెడ్డి రికార్డింగ్ ముగించారని, తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీ సుకోకుండా, కొప్పుల నుంచి మాత్రం డాక్యుమెంట్లు తీసుకుని మార్కింగ్ చేశారని, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి కుమారుడు సమాధానాలను మార్చే ప్రయత్నం చేసినా నాతారెడ్డి అభ్యంతరం చెప్పలేదని పేర్కొంటూ అడ్లూరి మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేలా నాతారెడ్డిని ఆదేశించాలని, కొప్పుల నుంచి తీసుకుని మార్కింగ్ చేసిన డాక్యుమెంట్లను తిరస్కరించాలని కోరారు. ఈ అప్లికేషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. వాటిని అనుమతించింది. ఒక తాళమే వేశారు: ఈసీ నివేదిక కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్నికల కమిషన్.. 2018 ఎన్నికల నాటి అధికారుల తీరును తప్పుబట్టింది. ఎన్నికల సామగ్రిని భద్రపర్చడంలో విధానపరమైన లోపాలున్నాయని చెప్పింది. జిల్లా ఎన్నికల అధికారి శరత్, ధర్మపురి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భిక్షపతి, డిప్యూటీ ఎన్నికల అధి కారి రాజేశంలు.. ఈసీ సూచనలను పాటించలేదని పే ర్కొంది. స్ట్రాంగ్ రూంలకు రెండు తాళాలు వేయా ల్సి ఉండగా, ఒక్క తాళం మాత్రమే వేశారని, తాళం చెవిలను సేకరించడంలో అధికారి రాజేశం నిర్లక్ష్యం వహించారని, తనకు రాతపూర్వక ఆదేశాలు లేవంటూ తా ళాలు తీసుకోలేదంది. ఎన్నికల రికార్డులను భద్రపర్చడంలోనూ ఈసీ మార్గదర్శకాలను నాటి జిల్లా ఎన్ని కల అధికారి పాటించలేదంది. ఆ తర్వాత వచ్చిన జి ల్లా ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల సంబంధిత మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించలేదని పేర్కొంది. -
ఎంజే అక్బర్‌పై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌పై కోర్టులో ప్రశ్నల వర్షం కురిసింది. ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో జర్నలిస్ట్ రమణి సహా పలువురు మహిళలు అక్బర్‌పై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం ఆయన రమణిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో శనివారం కోర్టుకు హాజరైన అక్బర్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏషియన్ ఏజ్ పత్రికలో రమణి చేరిక, తదితర అంశాలపై ఆమె తరఫున సీనియర్ లాయర్ అక్బర్‌ను ప్రశ్నించారు. -
అనుమతించిన మేరకే ‘కృష్ణా’ జలాల వినియోగం
క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ వివరణ సాక్షి, న్యూఢిల్లీ : ‘కృష్ణా’బేసిన్ వెలుపల ఉన్న పెన్నా, రామిలేరు, బుడమేరు, మూసి తదితర నదుల పరిధిలోని ప్రాంతాల్లో కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) అనుమతించిన మేరకే ‘కృష్ణా’ జలాలను సాగుకు వినియోగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల పంపంకంపై కేడబ్ల్యూడీటీ–2లో గురువారం విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా ఏపీ తరఫున సాక్షి కేవీ సుబ్బారావు (నీటి పారుదల నిపుణులు)ను తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ముఖ్యంగా కృష్ణా బేసిన్ వెలుపల వినియోగిస్తున్న కృష్ణా జలాలు, పెన్నా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలపై వైద్యనాథన్ ప్రశ్నలు సంధించారు. విచారణ అక్టోబరు 12, 13 తేదీలకు వాయిదా పడింది. ఈ రెండు రోజుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏపీ తరఫు సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఏపీ నుంచి ముగ్గురిని తెలంగాణ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామిన్ చేయనుండగా.. తెలంగాణ నుంచి ముగ్గురిని ఏపీ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి, న్యాయవాది గుంటూరు ప్రభాకర్ హాజరయ్యారు. -
కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్‌గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు. 26/11 దాడుల తర్వాత కూడా భారత్‌పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు.