సాక్షి, హైదరాబాద్: ‘ధర్మపురి ఎన్నికల’కేసులో జగిత్యాల జిల్లా రిటర్నింగ్ అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇతరుల(థర్డ్ పార్టీ)ను అనుమతించవద్దని సాక్షుల నమోదు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఈసీ సమర్పించిన నివేదిక ప్రతిని అడ్లూరి లక్ష్మణ్‌కూ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అడ్లూరి లక్ష్మణ్ వేసిన మధ్యంతర అప్లికేషన్లను అనుమతించింది.
2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని సవాల్ చేస్తూ ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో ఎల క్షన్ పిటిషన్ దాఖలు చేశారు. రీకౌంటింగ్‌కు ఉత్తర్వు లు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు.. సాక్ష్యాల రికార్డు కోసం హైకోర్టు మా జీ న్యాయమూర్తి ఎన్‌వీవీ నాతారెడ్డిని కమిషనర్‌గా నియమించింది.
రిటర్నింగ్ అధికారి భిక్షపతి నుంచి సమాచారం సేకరించకుండానే నాతారెడ్డి రికార్డింగ్ ముగించారని, తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీ సుకోకుండా, కొప్పుల నుంచి మాత్రం డాక్యుమెంట్లు తీసుకుని మార్కింగ్ చేశారని, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి కుమారుడు సమాధానాలను మార్చే ప్రయత్నం చేసినా నాతారెడ్డి అభ్యంతరం చెప్పలేదని పేర్కొంటూ అడ్లూరి మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేలా నాతారెడ్డిని ఆదేశించాలని, కొప్పుల నుంచి తీసుకుని మార్కింగ్ చేసిన డాక్యుమెంట్లను తిరస్కరించాలని కోరారు. ఈ అప్లికేషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. వాటిని అనుమతించింది.
ఒక తాళమే వేశారు: ఈసీ నివేదిక
కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్నికల కమిషన్.. 2018 ఎన్నికల నాటి అధికారుల తీరును తప్పుబట్టింది. ఎన్నికల సామగ్రిని భద్రపర్చడంలో విధానపరమైన లోపాలున్నాయని చెప్పింది. జిల్లా ఎన్నికల అధికారి శరత్, ధర్మపురి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భిక్షపతి, డిప్యూటీ ఎన్నికల అధి కారి రాజేశంలు.. ఈసీ సూచనలను పాటించలేదని పే ర్కొంది.
స్ట్రాంగ్ రూంలకు రెండు తాళాలు వేయా ల్సి ఉండగా, ఒక్క తాళం మాత్రమే వేశారని, తాళం చెవిలను సేకరించడంలో అధికారి రాజేశం నిర్లక్ష్యం వహించారని, తనకు రాతపూర్వక ఆదేశాలు లేవంటూ తా ళాలు తీసుకోలేదంది. ఎన్నికల రికార్డులను భద్రపర్చడంలోనూ ఈసీ మార్గదర్శకాలను నాటి జిల్లా ఎన్ని కల అధికారి పాటించలేదంది. ఆ తర్వాత వచ్చిన జి ల్లా ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల సంబంధిత మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment