
తనూశ్రీ దత్తా
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు’ అని ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్ తెలిపారు. జోథ్‌పూర్‌లో జరుగుతున్న హౌస్‌ఫుల్–4 సినిమా షూటింగ్ నుంచి ఇక్కడికి చేరుకున్న పటేకర్ ఈ విషయమై స్పందిస్తూ..‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’ అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్ నోటీసు పంపారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది.