
ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నాయకులు (ఇన్‌సెట్‌లో) కన్నీటి పర్యంత మవుతూ లీవ్ పెడుతున్న దృశ్యం
సోమందేపల్లి: సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదని మండల పరిషత్ అబివృద్ధి అధికారి లలితాబాయిపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎంపీడీఓపై టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, మాజీ సర్పంచ్ రంగప్ప, మహిళా ఎంపీటీసీ సభ్యురాలు భర్త బాబయ్య దౌర్జన్యంగా వ్యవహరించారు. అధికారి, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల మాటలతో మనస్థాపానికి గురైన ఎంపీడీఓ.. గ్రీవెన్స్‌లో అధికారుల సమక్షంలోనే కంట తడిపెట్టారు. తాను ఇక్కడ పని చేయలేనని,సెలవుపై వెళ్తానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు అక్కడికి చేరుకోవడంతో తగ్గిన టీడీపీ నాయకులు మెత్తబడ్డారు. అనంతరం అక్కడికక్కడే ఆమె మెడికల్ లీవ్‌పై వెళ్తున్నట్లు తహశీల్దార్ రామాంజనరెడ్డితో తెలిపారు. టీడీపీ మండల కన్వీనర్ గతంలోనూ పలు సమావేశాల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment