ఎంపీడీవోపై టీడీపీ నేత దాడి
Published Thu, Jul 28 2016 2:00 PM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
తుగ్గలి: అంగన్ వాడీ భవనం బిల్లు చెల్లించడం లేదని ఎంపీడీవో పై టీడీపీ నేత దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలిలో గురువారం వెలుగుచూసింది. సింగిల్ విండో మాజీ డెరైక్టర్ వెంకటపతి స్థానికంగా ఓ అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించాడు. దీనికి సంబంధించిన బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌పై కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. అయినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఇవ్వడం కుదరదని ఎంపీడీవో చెప్పడంతో.. కోపోద్రిక్తుడై ఆయన పై చేయి చేసుకున్నాడు. ఈ విషయం పై ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement