టీడీపీ కార్యకర్తలా..? అధికారులా..?
భోగాపురం : మీరు అధికారులా...? అధికార పార్టీ కార్యకర్తలా...? మా వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయకుండా, మీరు ప్రభుత్వం తరపున మాట్లాడతారా... ఇలా అయితే అధికారులెవ్వరూ గ్రామాల్లోకి రాలేరు అని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు తహశీల్దార్ లక్ష్మారెడ్డిని నిలదీశారు. ముందుగా తూడెం గ్రామంలో జన్మభూమి సభ నిర్వహించారు. అనంతరం కవులవాడ పంచాయతీలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన ఎంపీడీఓ పద్మజ, వివిధ శాఖల అధికారులకు చుక్కెదురైంది. తూడెం కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు సభకు హాజరయ్యేందుకు ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజులు బసవపాలెం మీదుగా వెళ్తుండగా, కవులవాడ పంచాయతీలో సమావేశాన్ని ఎయిర్‌పోర్టు బాధిత రైతులు అడ్డుకుంటున్నారని విషయం తెలుకుని వారిద్దరూ కవులవాడ గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సమావేశం జరగనివ్వకుండా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. అయితే వారికి నచ్చజెప్పేందుకు ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
- టీడీపీలో చేరితే ఎయిర్‌పోర్టు రాకుండా చేస్తారా?
మీ వెంట ఉంటే ఎయిర్‌పోర్టు ప్లానులో మీ భూములు తప్పిస్తామని మీరు కొంతమందితో ఫోన్‌లో మంతనాలు చేస్తున్నారు కదా... మీ వెనుక కాదు ఏకంగా టీడీపీలో చేరిపోతాం ఎయిర్‌పోర్టు రాకుండా చేయగలరా అని ఏఎంసీ చైర్మన్‌ను రైతులు, గ్రామస్తులు నిలదీశారు. భూములు, గ్రామాలు పోయి మేం ఏడుస్తుంటే మీరు రాజకీయం చేస్తారా అటూ మండిపడ్డారు. దీంతో కార్యక్రమాన్ని వారుుదా వేయూలని ఎంపీపీ బంగార్రాజు, ఎంపీడీఓ పద్మజకు చెప్పి వెళ్లిపోయూరు. కుర్చీలను గ్రామస్తులు తీసేయడంతో అధికారులు సుమారు రెండు గంటల పాటు వేదికపై నిలబడాల్సి వచ్చింది. అనంతరం అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠారుుంచి నినాదాలు చేశారు. కార్యక్రమంలో బెరైడ్డి ప్రభాకరరెడ్డి, దాట్ల శ్రీనివాసరాజు, కొల్లి రామ్మూర్తి, కొండపు లక్ష్మారెడ్డి, దల్లి శ్రీనివాసు, దారపు అప్పన్న రెడ్డి, శీరపు గురునాథరెడ్డి, అన్నమయ్య, కోరాడ అప్పన్న, మట్ట నర్శింగరావు, తదితరులు పాల్గొన్నారు.