
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్‌పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్‌రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్‌పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్‌యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్‌నకు వెళ్తుండగా ముఖేష్‌యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్‌యాదవ్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేష్‌పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు.
చదవండి: అబ్దుల్లాపూర్ మెట్‌లో దారుణం.. జంట మృతదేహాల కలకలం
Comments
Please login to add a commentAdd a comment