
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు..
తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment