
హోసూరు/బెంగుళూరు: తొమ్మిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకొని గర్భవతి చేసిన వ్యక్తిపై డెంకణీకోట మహిళా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాయకోట ప్రాంతానికి చెందిన బాలికను ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నేగౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్ (24) జనవరి 13న పెళ్లి చేసుకొన్నాడు.
రెండు రోజుల క్రితం ఆ బాలిక ఆరోగ్యం బాగాలేదని డెంకణీకోట సమీపంలోని పంజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు పరిశీలించగా బాలిక గర్భవతిగా అని ధృవీకరించారు. మైనర్ కావడంతో క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖాధికార్లకు సమాచారమిచ్చారు. చివరకు పోలీసులు వచ్చి మైనర్‌ను పెళ్లి చేసుకున్న నేరంపై భర్త దేవరాజ్‌పై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు.
(చదవండి: భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి)
Comments
Please login to add a commentAdd a comment