మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ రోటిగడ్డతండాలో ఆదివారం భార్యను హత్య చేసిన భర్త కేసులో పోలీసులకు కీలక ఆధారం చిక్కింది.
చింతపల్లి : మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ రోటిగడ్డతండాలో ఆదివారం భార్యను హత్య చేసిన భర్త కేసులో పోలీసులకు కీలక ఆధారం చిక్కింది. వివరాలు..రోటిగడ్డతండాకు చెందిన నేనావత్ రాజు బోరుబండిపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మోతీ(25) వ్యవసాయకూలీగా పనిచేస్తుంది. రాజు పది ఇరవైరోజులకొకసారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భర్య పై రాజు అనుమాను పెంచుకున్నాడు.
శనివారం రాత్రి డ్యూటీ దిగి వచ్చిన మద్యం మత్తులో భార్యను అక్రమ సంబంధం అంటగట్టి విచారించసాగాడు. ఈ నేపథ్యంలో కుమారులు ముఖేశ్, రాకేష్ ఇద్దరితో రాత్రి 12గంటల సమయంలో తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తూ సుత్తితో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసులకు దొరికిన వీడియోలో ఉంది. ఈ వీడియో పోలీసులకు హత్యకు సంబంధించి పూర్తి ఆధారంగా మా రింది. రెండు రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం గ్రామానికి రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘట నాస్థలానికి చేరుకుని రాజును విచారించగా తన భార్య తప్పు చే సిందనే అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.