తిరువళ్లూరు: భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త ఆ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేపంబట్టులోని వల్లలార్ నగర్‌లో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టు గ్రామానికి చెందిన రాజేష్‌కుమార్(24) కాల్ టాక్సీ డ్రైవర్. ఇదే ప్రాంతానికి చెందిన కోదండరామన్ చెన్నైలో ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె తమిళ్‌సెల్వి శ్రీపెరంబదూరులోని శ్రీవెంకటేశ్వరా కళాశాలలో ఈసీఈ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతూ వుంది. ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్‌కు తమిళ్‌సెల్వికి మధ్య వున్న పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాలుడు వున్నాడు. వివాహ మైనప్పటి నుంచి అత్తారింటిలో వున్న రాజేష్‌కుమార్ దంపతులు మూడు రోజుల కిందట వేపంబట్టులోని వల్లలార్ నగర్‌లో అద్దెకు దిగారు.
ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్ తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం పది గంటలు దాటుతున్నా బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఇంటి యజమాని తలుపులు తెరిచి చూసి షాక్‌కు గురయ్యాడు. రక్తపు మడుగులో వున్న తమిళ్‌సెల్వి, ఉరి వేసుకుని రాజేష్‌కుమార్ మృతి చెంది వుండడాన్ని గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా తమిళ్‌సెల్వి గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం రాజేష్‌కుమార్ సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు భావించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
రాజేష్‌కుమా ర్ తమిళ్‌సెల్విల వైవాహిక జీవితం సజావుగా సాగినా ఆరు నెలల నుంచి తర చూ ఘర్షణ పడేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రాజేష్‌కుమార్ తన వదినతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారన్న అనుమానంతో భార్యభర్తలు ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారని పోలీసులు వివరించారు. అయితే తల్లి హత్యకు గురి కావడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఐదు నెలల చిన్నారి అనాథగా మారిపోయింది. విగతజీవులుగా పడి వున్న తల్లి వద్ద పాలు కోసం ఏడూస్తూ చిన్నారి రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
భార్యను హత్య చేసి ఆత్మహత్య
Published Tue, Apr 21 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement
Advertisement