సాక్షి, మోతుగూడెం: దంపతుల విభేదాల ఫలితంగా అందరూ చూస్తుండగానే నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన సంఘటన డొంకరాయిలో చోటు చేసుకుంది. గాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్య వెంకటలక్ష్మి(38)ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఏపీ జెన్‌కో ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కుమారుడితో కలసి వెంకటలక్ష్మి గ్రామంలోనే మరోచోట ఉంటోంది. డొంకరాయి మార్కెట్ సెంటర్‌లోని ఒక ఇంట్లో కూలి పనికి వెళ్లిన భార్య వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు ‘నా ప్రమేయం లేకుండా పనికి వెళతావా?’ అంటూ ఆమె గుండెల్లో కత్తితో పొడిచి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.
చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి..
Comments
Please login to add a commentAdd a comment