చిట్టిబాబు మృతిపై విచారణ: సీపీ
Published Fri, Mar 3 2017 3:19 PM | Last Updated on Fri, May 25 2018 5:57 PM
- ప్రజాసంఘాల ఆందోళన
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నం, ఆయన భార్య మృతిపై ప్రజాసంఘాలు, దళిత సంఘాల వారు స్థానికంగా ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఈ చర్యకు ఒడిగట్టారని వారు ఆరోపించారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, సంఘటన స్థలికి ఏసీపీ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ఆందోళన కారకులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement