service Revolver
-
ఎస్సై రివాల్వర్‌ను కాజేసి మరీ అత్తను కాల్చి..
సాక్షి, హనుమకొండ/మంచిర్యాల: ఆర్థిక లావాదేవీల వ్యవహారంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక విషయం వెలుగు చూసింది. సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రసాద్.. ఎస్సై రివాల్వర్‌ను కాజేసి మరీ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హనుమకొండ జిల్లా గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో కమలమ్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కూతురు రమాదేవిని ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రసాద్-రమాదేవికి ఇద్దరు కూతుళ్లు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. గురువారం ఉదయం మంచిర్యాల నుంచి హనుమకొండలోని అత్తింటికి వచ్చిన ప్రసాద్.. కమలమ్మపై ఉన్నట్లుండి కాల్పులకు దిగాడు. ఒక రౌండ్ కాల్పులు జరగ్గా.. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆపై భార్యాకూతురిపైనా దాడికి యత్నించిన ప్రసాద్‌ను స్థానికులు అడ్డుకుని చితకబాదారు. గాయపడిన ప్రసాద్‌ను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డబ్బుల విషయంలో గొడవ పెద్దదై.. కుటుంబ కలహాలతో పాటు.. ఆర్థిక లావాదేవీలు ఈ నేరానికి కారణమని తెలుస్తోంది. ప్రసాద్ కమలమ్మకు రూ.4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు విషయంలోనే ప్రధానంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కమలమ్మపై ప్రసాద్ కాల్పులు జరిపాడని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ చెబుతున్నారు. నా భర్తను చంపేయండి భర్త ప్రసాద్ నిత్యం తాగొచ్చి గొడవ పడడంతో.. తాను పుట్టింటికి వచ్చేశానని రమాదేవి చెబుతోంది. వారం కిందట భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి వచ్చిన ప్రసాద్.. తన కళ్ల ముందే తల్లిని కాల్చి చంపినట్లు రమాదేవి చెప్పింది. అది చూసిన తనపై, తన కూతురిపైనా ప్రసాద్ దాడికి యత్నించాడని తెలిపిందామె. అయితే.. ప్రసాద్ బతకడానికి అర్హుడు కాడని.. అతన్ని చంపేయాలని రమాదేవి కన్నీటి పర్యంతం అయ్యింది. ‘‘నా భర్త పచ్చి తాగుబోతు. నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడనే పుట్టింటికి వచ్చేశా. ఇవాళ ఇంటికి వచ్చి నా తల్లిని పంచాడు. టవల్‌తో ఉరేసి చంపాలనుకున్నానని.. కానీ, స్థానికులు నన్ను అడ్డుకున్నారు. సివిల్ కానిస్టేబుల్ అయిన ప్రసాద్‌కు సర్వీస్ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యమూ ఉన్నట్లు స్పష్టమవుతోంది’’ అని ప్రసాద్ భార్య రమాదేవి అంటోంది. ఉన్నతాధికారుల సీరియస్ కానిస్టేబుల్ ప్రసాద్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోంది. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ సందర్శించారు. అయితే పేలిన తూటా గొట్టం కోసం క్లూస్ టీం ఇంకా గాలింపు జరుపుతోంది. మరోవైపు సివిల్స్ కానిస్టేబుల్ ప్రసాద్‌కు సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయంపై జరిపిన విచారణలో కీలక విషయం బయటపడింది. కోటపల్లి స్టేషన్ లో ఎస్సై సురేష్ రివాల్వర్ కానిస్టేబుల్ ప్రసాద్ దొంగతనం చేసినట్లు తేలింది. గత రాత్రి తుపాకీని దొంగిలించి.. తన వెంట హనుమకొండకు తీసుకెళ్లాడు ప్రసాద్. ఆ రివాల్వర్తోనే కమలను కాల్చి చంపాడు. దీంతో రివాల్వర్ చోరీ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్లోనే ఈ చోరీ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. -
నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి
ఒడిషా చరిత్రలో నెత్తుటి మరక చోటు చేసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిశోర్ దాస్(61)పై తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిన ఆయనను.. ఝార్సుగుడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉన్నత చికిత్స కోసం హెలీకాఫ్టర్లో భువనేశ్వర్ తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మంత్రి మృతికి కారణమైన ఏఎస్ఐ గతంలో ఆయన వద్ద గన్‌మెన్‌గా పని చేసినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై రాష్ట్ర హోంశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఝార్సుగుడ: బ్రజ్‌రాజ్ నగర్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తుపాకీ కాల్పులకు గురికావడం కలకలం రేపింది. అభిమానులతో కలిసి ఊరేగింపునకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఆయనపై తుపాకీ తూటా పేలింది. బ్రజ్‌రాజ్ నగర్ గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఏఎస్ఐ గోపాల్‌దాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. మంత్రి ఛాతికి గురిపెట్టి, తుపాకీ పేల్చడంతో బుల్లెట్ శరీరంలో ఎడమవైపు దూసుకు పోయింది. బ్రజ్‌రాజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కొత్త కార్యాలయ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న హడావిడిలో గాంధీ ఛక్ సమీపంలో తుపాకీ పేలుడు సంభవించింది. గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఠాణా ఏఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో అతి సమీపం నుంచి మంత్రి ఛాతీకి గురిపెట్టి కాల్చడంతో మంత్రి అక్కడికక్కడే కుప్పకూలారు. పక్కనే స్థానిక ఐఐసీ ప్రద్యుమ్న స్వొయినిపై సైతం కాల్పులు జరపగా, ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం నవీన్ పట్నాయక్ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై క్రైంశాఖ దర్యాప్తుకు ఆదేశించారు. ఒడిషా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ మృతి కేసులో కీలక విషయం వెలుగు చూసింది. ఆయన్ని కాల్చి చంపిన ఏఎస్ఐ గోపాలకృష్ణ దాస్ మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న దాస్.. పదేళ్లుగా సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే.. అతనికి ఉన్న మానసిక వ్యాధిని పక్కనపెట్టి.. సర్వీస్ రివాల్వర్ జారీ చేయడంతో పాటు బ్రజరాజ్ నగర్ పోలీస్ పోస్ట్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు ఆయనకు పదేళ్లుగా చికిత్స అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ త్రిపాఠి మీడియాకు వివరాలను వెల్లడించారు. పదేళ్ల నుంచి ట్రీట్మెంట్ పదేళ్ల కిందట గోపాలకృష్ణ దాస్ తన దగ్గరకు చికిత్స కోసం వచ్చాడని ఆయన తెలిపాడు. కోపధారి అయిన దాస్.. దానిని నియంత్రించుకునేందుకు తన దగ్గర చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతనికి ఉన్న బైపోలార్ డిజార్డర్ వ్యాధికి ప్రతీరోజూ మందులు వాడాల్సిందేనని, కానీ, ఏడాదిగా అతను తన దగ్గరికి రాలేదని డాక్టర్ త్రిపాఠి వెల్లడించారు. జార్సుగూడ ఎస్డీపీవో గుప్తేశ్వర్ భోయ్ మాట్లాడుతూ.. దాస్‌కు ఏఎస్ఐ హోదాలో బ్రజ్‌రాజ్‌నగర్ ఏరియా గాంధీ చక్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారని, ఆ తర్వాతే లైసెన్స్డ్ పిస్టోల్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య జయంతి దాస్ తెలిపారు. వృత్తి రిత్యా కుటుంబానికి దూరంగా(400 కిలోమీటర్ల..) ఉంటున్నాడని ఆమె వివరించారు. మంత్రిపై దాడికి సంబంధించిన సమాచారం టీవీ చానెళ్ల ప్రసారంతో తెలిసిందన్నారు. ‘నా భర్త గత ఏడాదిన్నరగా గాంధీ ఛక్ ఔటుపోస్టులో ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యానికి సంబంధించి మందులు కూడా వాడుతున్నారు. అయితే అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియదు. ఉదయమే కుమార్తెతో, శనివారం రాత్రి కుమారుడితో వీడియోకాల్ ద్వారా మాట్లాడారు. కాల్ సమయంలో పూర్తిగా సాధారణమైనట్లు కనిపించా’రని ఆమె వివరించారు. ఈ చర్యతో తామంతా షాక్‌కు గురయ్యామన్నారు. నిందితుడు దాస్‌ను ఝార్సుగూడ పోలీసులు ఘటనకు పాల్పడిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని ఉత్తర రేంజ్ ఐజీ దీపక్‌కుమార్ ప్రకటించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మంత్రి దగ్గర కూడా.. నిందిత ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు బ్రజరాజ్ నగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీఓ) గుప్తేశ్వర్ భొయ్ తెలిపారు. గంజామ్ జిల్లా జలేశ్వర్ఖండికి చెందిన దాస్.. బెర్హమ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత జార్సుగూడలో పన్నెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో 2 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఈ పరిస్థితికి ప్రేరేపించిన కారణాలను ధ్రువీకరించే దిశలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. గోపాల్‌దాస్.. కొన్నేళ్ల క్రితం మంత్రి వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్ఓ)గా పనిచేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. భువనేశ్వర్‌కు ఎయిర్‌లిఫ్ట్.. తుపాకీ కాల్పులకు గురైన రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్‌ను ముందుగా ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో భువనేశ్వర్‌కు తరలించారు. మధ్యాహ్నం 2.55 గంటలకు విమానాశ్రయానికి చేరడంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, అంబులెన్స్‌లో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేర్చారు. క్యాపిటల్ ఆస్పత్రి డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్సను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. మంత్రి గుండెల్లోకి బుల్లెట్ దూసుకు పోవడంతో ఊపిరితిత్తులు, లోపలి భాగాల పునరుద్ధరణకు చేసిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త ప్రసరణకు చేసిన ప్రయత్నాలు అనుకూలించ లేదు. ఐసీయూలో అత్యవసర చికిత్స సేవలు ఫలప్రదం కానందున ప్రాణాలు కాపాడటం సాధ్యం కాలేదని అపోలో ఆస్పత్రి వర్గాలు మీడియాకు వెల్లడించారు. దీంతో భారీగా అంతర్గత రక్తస్రావమై, ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసినట్లు డాక్టర్ దేవాశిష్ నాయక్ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం వెల్లడించింది. అత్యంత ధనిక మంత్రిగా.. ఆరోగ్య శాఖామంత్రి నవ కిషోర్ దాస్ నవీన్ మంత్రి మండలిలో రెండో అత్యంత ధనవంతుడు. 2009 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి నిరవధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ఎన్నికల ముందు బీజేడీ చేరి, మరోసారి విజయం సాధించారు. పార్టీలో అనతి కాలంలోనే కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 70కి పైగా వ్యక్తిగత వాహనాలు, రూ.కోటి విలువ చేసే మెర్సిడెజ్ బెంగ్ కారు, ఒక రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్, రైఫిల్ కలిగి ఉన్న కిషోర్‌దాస్ సమగ్ర ఆస్తుల విలువ రూ.34 కోట్లుగా గతేడాది ప్రకటించారు. గనుల మైనింగ్ ఆనయకు ప్రధాన ఆదాయ వనరు. బలమైన నాయకుడిని కోల్పోయాం.. 1962 జనవరి 7న సంబల్పూర్లో జన్మించిన నవకిషోర్ దాస్.. ఎల్ఎల్.బి, ఎంఏ పూర్తి చేశారు. 1980 దశకంలో విద్యార్థి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంబల్పూర్లోని గంగాధర్ మెహెర్ కళాశాల(ప్రస్తుతం గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం)లో చదువుతున్నప్పుడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. దాస్ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా 4 దశాబ్దాలు కొనసాగింది. ఉన్నత నాయకత్వ లక్షణాలతో అన్ని వర్గాల ఆదరణ చూరగొన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి తొలుత కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత బిజూ జనతాదళ్ అభ్యరి్థగా శాసన సభ్యుడిగా తుదిశ్వాస వరకు కొనసాగారు. ఆయన మరణంతో పశి్చమ ఒడిశాతో రాష్ట్రం బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దాస్ ఆకస్మిక మృతి ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని ప్రకటించారు. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు వైద్య రంగంలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. పశ్చిమ ఒడిశాలో బీజేడీని బలోపేతం చేయడంలో అతని సహకారం అసాధారణమైనదని, పారీ్టలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. గతంలో మంత్రి మహంతిపై.. బిజూ జనతాదళ్ హయాంలో మంత్రులపై దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో 2014 ఫిబ్రవరి 21న న్యాయశాఖ మంత్రి మహేశ్వర్ మహంతిపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటన పూరీలో చోటు చేసుకుంది. మంత్రి శరీరంలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. అదృష్టావశాతు ఈ దాడి నుంచి మంత్రి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా మంత్రి నవకిషోర్ దాస్ తుపాకీ పేలుడుతో మృతిచెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 2009 నుంచి ఆయన ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్ మంత్రి కిషోర్‌దాస్‌పై తుపాకీ దాడి తదనంతర మృత్యు ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిపై బాధ్యత వహిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కంటాబంజి ఎమ్మెల్యే సంతోశ్ సింగ్ సలుజా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఆరోగ్య మంత్రిపై కాల్పులపట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దారుణమైన ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తోందని, అయితే ఈ విషాద ఘటన రాష్ట్ర ప్రజల భద్రత వ్యవస్థ పట్ల ప్రశ్న లేవనెత్తిందని నిలదీశారు. ప్రభుత్వం తన మంత్రికి భద్రత కల్పించ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ట అని, దీనిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని మీడియా వింగ్ చైర్మన్ గణేశ్వర్ బెహెరా, జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ డిమాండ్ చేశారు. ప్రధాని సహా పలువురి సంతాపం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కాల్పులకు గురికావడం బాధాకరమన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేశ్ లాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ ప్రముఖులు మంత్రి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అరుణ్ బొత్రా నేతృత్వంలో.. బ్రజ్‌రాజ్‌నగర్‌లో మంత్రి కిషోర్‌దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరపడంతో మృతికి దారితీసిన ఘటనపై విచారణ జరిపేందుకు ఒడిశా క్రైంబ్రాంచ్ బృందం ఆదివారం సాయంత్రం ఝార్సుగుడ చేరుకుంది. ఎస్పీ రమేశ్ చంద్ర దొర ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ బృందంలో బాలిస్టిక్, సైబర్ నిపుణులు, క్రైంబ్రాంచ్ అధికారులు ఉన్నారు. దర్యాప్తును క్రైంశాఖ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. కాల్పులకు గల కారణాన్ని తెలుసుకోవడానికి, ఘటన జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఐను విచారించనున్నారు. -
సర్వీస్ రివాల్వర్‌తో జవాను ఆత్మహత్య
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంకన్జోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. ) బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియన్ బృందం శుక్రవారం సంగం గ్రామంలో నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లోనూ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శిబిరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా , దోటమెటా గ్రామాల మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వగ్రామం ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి వచ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్రవారం ఇదే బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వస్తుందేమో అన్న డిప్రెషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. (హిమాచల్ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన ) -
ప్రేయసిని కాల్చిన చంపిన ప్రియుడు
ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నీవులేక నేను లేను అనేలా ప్రేమ సామ్రాజ్యంలో విహరించారు. పెళ్లికి దారితీసే క్రమంలో ప్రేమ వికటించింది. మనస్పర్థలకు దారితీసింది. ఈలోకంలో నీవు ఉండకూడదని ప్రియురాలిని తుపాకీతో కాల్చేశాడు. నీవు లేనపుడు నేను మాత్రం ఎందుకు అని తాను కాల్చుకున్నాడు. ప్రేమికులిద్దరి నాలుగేళ్ల ప్రేమకు నూరేళ్లు నిండిపోయాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అర్ధరాత్రి ప్రియురాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న యువకుడు కొన్ని గంటల్లోనే ప్రియురాలిని హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసేందుకు అంగీకరించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. విల్లుపురం జిల్లా అన్నియూర్ కరుణానిధి నగర్‌కు చెందిన శేఖర్, మారియమ్మాళ్ దంపతులు తమ కుమార్తె సరస్వతి (23)ని వైద్యురాలిని చేయాలని కలలు కనేవారు. సరస్వతి సైతం పట్టుదలగా చదివేది. డిగ్రీ పాసైన తరువాత నర్సింగ్ కోర్సు చేస్తున్న సమయంలో వైద్య సీటు వచ్చింది. దీంతో నర్సింగ్ చదువును మధ్యలోనే ఆపివేసి చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరింది. ప్రస్తుతం ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇదిలా ఉండగా, ఈరోడ్ జిల్లా సిద్దగౌండంపాళెంకు చెందిన కార్తివేల్ (27)తో ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాటింగ్‌లు చేసుకునేవారు. కార్తిక్‌వేల్ తమిళనాడు పోలీస్‌శాఖలో కమాండో పోలీస్‌గా పనిచేస్తున్నాడు. చెన్నైలో ఉంటూ వీవీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రేమికులిద్దరూ చెన్నైలో ఉండడంతో ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య అడపాదడపా గొడవలు రేగేవి. మాట్లాడకోకుండా ఉంటూ మరలా కలుసుకునే వారు. ఇదే సమయంలో సర్వస్వతి తన తోటి వైద్య విద్యార్థితో స్నేహం చేయడాన్ని కార్తిక్‌వేల్ తట్టుకోలేక తగవు పెట్టుకున్నాడు. మరలా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం తన జన్మదినం కావడంతో సరస్వతి అన్నియూర్‌లోని తన ఇంటికి వచ్చింది. కార్తిక్‌వేల్ కూడా కేక్‌తో సరస్వతి ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం సరస్వతి తల్లిదండ్రులకు తెలియడంతో సాధారణంగా తీసుకున్నారు. ప్రియుడు తెచ్చిన కేక్‌ను అర్ధరాత్రి 12 గంటలు దాటగానే బంధుమిత్రుల సమక్షంలో సరస్వతి కట్ చేయగా కోలాహలంగా జన్మదిన వేడుకలు ముగిశాయి. ఆహ్వానితులంతా వెళ్లిపోగా సరస్వతి తల్లిదండ్రులు హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టుకోకుండా కబుర్లలోకి దిగారు. బుధవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో వరుసగా రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం రావడంతో సరస్వతి తల్లిదండ్రులు గదిలోకి వెళ్లిచూడగా సరస్వతి, కార్తివేల్ చెరోవైపున ప్రాణాలు కోల్పోయిన స్థితిలో రక్తపు మడుగులో పడిఉన్నారు. పోలీసులు వచ్చి శవాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. వారిపక్కనే పడివున్న కార్తివేల్ సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమాన భూతం పోలీసుల కథనం ప్రకారం, ప్రేమికుల ఇరువురూ తరచూ తగవులాడుకుని విడిపోవడం, మరలా కలుసుకునే వారు. వైద్యకళాశాలలో తోటి విద్యార్థితో సరస్వతి చనువుగా ఉన్నట్లు కార్తిక్‌వేల్‌కు అనుమానం ఏర్పడింది. ఈ విషయమై కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రియురాలి ఎక్కడ మారిపోతుందోనని గాబరాపడిన కార్తిక్‌వేల్ వెంటనే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టడంతో సరస్వతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు తన సర్వీస్ రివాల్వర్‌తో ప్రియురాలి గుండెపై రెండుసార్లు తుపాకీతో కాల్చాడు. వెంటనే తన తలకు అదే రివాల్వర్‌ను గురిపెట్టుకుని పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన తండ్రి ఎంతో గారాబంగా పెంచుకున్న కుమార్తెను కోల్పోయానని సరస్వతి శవంపై పడి తండ్రి శేఖర్ గుండలవిసేలా కన్నీరుకార్చాడు. ‘‘సాధారణ రైతుగా బతుకీడుస్తున్న నాకు తగిన ఆర్థిక స్థోమతలేకున్నా ఏకైక కుమార్తెను ఎంబీబీఎస్‌లో చేర్చాను, వైద్యురాలు అవుతుంది, గ్రామాల్లో సేవలందిస్తుందని కలలు కన్నాను, జన్మదినం రోజునే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు’’ అని రోదించాడు. -
ప్రాణాలే పణం
⇔ కుకునూర్‌పల్లిలో ఉద్యోగం సవాలే.. ⇔కలకలం రేపిన ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ⇔ రోజంతా అట్టుడికిన కుకునూర్‌పల్లి ⇔ తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళన, ధర్నాలు ⇔ నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి ⇔ అదే క్వార్టర్... అదే కణత ⇔ మరణం తీరు ఒకటే ⇔ ఇద్దరు ఎస్ఐల విషాదాంతం గజ్వేల్/కొండపాక/గజ్వేల్‌రూరల్/దౌల్తాబాద్: ఒకే పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్ఐల ఆత్మహత్యలు... అది కూడా ఒకే తరహాలో... నాడు రామకృష్ణారెడ్డి... నేడు ప్రభాకర్‌రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ వ్యవహారం తాజా ఘటనతో మరోసారి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇలాకాలో ఇది మూడో ఘటన. మార్చి 3న దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు దంపతుల ఆత్మహత్య ఉదంతం కూడా తెలిసిందే.కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి.. 10 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి తరహాలోనే బలవన్మరణానికి పాల్పడడమే ఇందుకు కారణం. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన వత్సల రామకష్ణారెడ్డి (38)1996లో పదవ తరగతి పూర్తికాగానే కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత 2006–07లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అదే సమయంలో ఎస్ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, లక్డీకాపూల్, గజ్వేల్, తొగుట పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. 2015 మార్చిలో కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టాడు. 2016 ఆగస్టు 16కు ముందు రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన వేధింపులను ఎదుర్కొని... ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన క్వార్టర్లో రామకృష్ణారెడ్డి మాదిరిగానే కుడి కణతపైనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మరణించడం విషాదాన్ని నింపింది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పని చేయడం పెద్ద సవాల్ అనే విషయం మరోసారి బయటపడింది. మావోయిస్టు కోటలో ‘పోలీస్’ మావోయిస్టు ఉద్యమానికి ఆకర్శిత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరులో ప్రభాకర్‌రెడ్డి తాను పోలీసు ఉద్యోగం చేయాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాడు. ముందుగా కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో ఉద్యోగం సంపాదించి కొద్ది రోజుల పాటు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత రాతపరీక్ష ద్వారా ఎస్ఐగా నియామకమై తన కలను నెరవేర్చుకున్నాడు. ఏడాదిన్నర క్రితం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రచనను వివాహం చేసుకోగా... ఈ దంపతులకు ఐదు నెలల కిత్రం బాబు జన్మించాడు. జీవితంలో స్థిరపడ్డ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే మార్చి 3న దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం పెద్ద ఎత్తున దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీనికి పరంపరగానే ప్రభాకర్‌రెడ్డి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ‘పక్కదారి’పై ఆగ్రహం 2012లో ఉద్యోగంలో చేరిన ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల గల మల్కాజ్గిరి, శామీర్‌పేట ఠాణాల్లోనూ, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మరికొంత కాలం పనిచేశారు. రామకృష్ణారెడ్డి మరణానంతరం కుకునూర్‌పల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రభాకర్‌రెడ్డితో స్నేహమున్న సన్నిహితులు ఆయన మరణవార్తను తెలుసుకుని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. టీవీ ఛానళ్లలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనుక మరో కోణముందంటూ... హైదరాబాద్‌కు చెందిన బ్యూటీషియన్ ఆత్మహత్యతో సంబంధముందని ప్రచారం జరగడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇదే క్రమంలో సన్నిహితులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్‌ను దహనం చేశారు. రాత్రి 9:30కి మృతదేహం తరలింపు ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి శవాన్ని రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటికే ఆందోళన కొనసాగుతుండగా... ఆందోళనకారులను డీసీఎంలో ఎక్కించి శవాన్ని తరలించారు. ఈ సందర్భంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తానికి పోలీసులు శవాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించారు. -
చిట్టిబాబు మృతిపై విచారణ: సీపీ
- ప్రజాసంఘాల ఆందోళన దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నం, ఆయన భార్య మృతిపై ప్రజాసంఘాలు, దళిత సంఘాల వారు స్థానికంగా ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఈ చర్యకు ఒడిగట్టారని వారు ఆరోపించారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, సంఘటన స్థలికి ఏసీపీ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ఆందోళన కారకులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భార్యను కాల్చి,తాను కాల్చుకున్న ఎస్ఐ
-
భార్యను కాల్చి, తాను కాల్చుకున్న దుబ్బాక ఎస్ఐ
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి, అనంతరం తాను కూడా కాల్చుకున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో భార్య రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా అవినీతి ఆరోపణలతో మూడు రోజులు క్రితం ఎస్ఐ సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే ఇంతవరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని తెలుస్తోంది. చిట్టిబాబు స్వస్థలం కడప. కాగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిట్టిబాబుకు కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల చిట్టిబాబు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. చిట్టిబాబు మృదుస్వభావి అని, ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్నవారిని తోటి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న డీఐజీ ఘటనా స్థలానికి చేరుకుని, సంఘటన పై ఆరా తీశారు. -
నయీం కేసులో వేగం పెంచిన సిట్
*నయాం ‘సన్నిహిత నేతల’కు ఆయుధ లెసైన్స్‌లు రద్దు హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయాం కేసును విచారిస్తున్న ‘సిట్’ పోలీసులు వేగం పెంచారు. దీనిలో భాగంగానే అధికార టీఆర్ఎస్తో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లెసైన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారని, కొందరు నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారుల్లో ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. నేతలకు త్వరలో నోటీసులు? నయాం ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు అన్నీ సంచలనాత్మకంగానే ఉన్నాయి. రెండు దశాబ్ధాలుగా అటు అధికారంలో ఉన్న పార్టీల నేతలతో, ఇటు పోలీసు అధికారులతో విడదీయలేని సంబంధాలున్న నయాం పాల్పడిన అరాచకాల్లో వీరికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఒక వైపు ఆయా జిల్లాల్లో పోలీసు కేసులు నమోదు అవుతుండగా వారిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారూ ఉంటున్నారు. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ పోలీసు బాసులు ఇలా అందరికీ సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా నాయకులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా ఆయా నేతలకు ఉన్న వ్యక్తిగత లెసైన్సు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సిట్ నుంచి ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇవ్వడంతో, ఎస్పీలు సైతం కలెక్టర్లకు పరిస్థితిని విన్నవించారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ఆయుధ లెసైన్సులను రద్దు చేశారని సమాచారం. కేసులు ఎలా ఎదుర్కొందాం ! నయాంతో సంబంధాలు ఉన్నాయని ప్రచారమైన నేతలు కొందరు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో కూడా మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒక వేళ అరెస్టు అయితే పరిస్తితి ఏమీటి..? కేసును ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లో స్పష్టత కోసం ఇప్పటికే కొందరు నేతలు సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించారని తెలిసింది. వీరిలో కొందరు సుప్రీం కోర్టు న్యాయవాదుల సలహా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అధికారిక పదవుల్లో ఉన్న నేతలే కాకుండా, ఆయా పార్టీలకు చెందిన నాయకులూ ఉన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పోలీసు అధికారులకు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తమపై కేసులు తప్పవన్న అభిప్రాయానికి నేతలు వస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసుల నుంచి తమకు నోటీసులు అందేలోపే.. తమ పదవులకు రాజీనామా చేసి, సిట్ విచారణను స్వాగతిస్తున్నామని, విచారణ తర్వాత నిర్దోషులుగా తాము బయటకు వస్తామని మీడియా ఎదుట ప్రకటించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారని చెబుతున్నారు. 8 మంది పోలీసు అధికారులకు మెమోలు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. దశాబ్ద కాలంగా నయీంతో సెటిల్మెంట్లు జరిపిన అధికారులకు సంబంధించి బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే 21 మంది పోలీసు అధికారులు నయీంతో లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. పలు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అదీ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలగడం పట్ల పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దానికి అనుగుణంగా మొదటి విడతలో 8మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. వీరు వెంటనే సర్వీసు రివ్వాలర్లు పోలీసు ప్రధాన కార్యాలయంలో అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు సమాచారం. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసుశాఖ యోచిస్తోంది. వీరందరూ గ్యాంగ్‌స్టర్‌తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు పెద్ద ఎత్తున లబ్ది పొందినట్లు సిట్‌కు పక్కా ఆధారాలు లభించాయి. నయీంతో పోలీసులు సన్నిహితంగా మెలిగినట్లు అతని డెన్‌లో ఫోటోలు లభించాయి. వీటితో పాటు భారీగా భూలావాదేవీలు జరిపిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వీటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది. మునుముందు వీరందరిపై క్రమశిక్షణ చర్యల కింద డిపార్టుమెంట్ నుంచి తొలగించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. -
రివాల్వర్ తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
ముంబై: విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర జలానా జిల్టాలోని సూపరింటిండెంట్ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్ పథాడే (32) తన సర్వీసు రివాల్వర్ తో శనివారం ఉదయం కాల్చుకొని చనిపోయాడని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. అనంతరం తోటి ఉద్యోగులు ప్రభాకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కారణాలు తెలియాల్సి ఉంది. -
రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి
-
రామకృష్ణ స్వగ్రామంలో విషాద ఛాయలు
-
తూటా పేలిందా..పేల్చుకున్నాడా?
తన సర్వీసు రివాల్వర్ తూటాకు బలైన రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్‌ది ఆత్మహత్యా..లేక మిస్‌ఫైరా అన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అద్దంకి : తన సర్వీస్ రివాల్వార్ తూటాకు బలైన రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్‌ది ఆత్మహత్యా.. లేక మిస్ ఫైరా.. అన్న విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఠాణాలో పేలిన తూటా కావడంతో కారణాలు బయటి వారికి తెలిసే అవకాశం లేదు. ఎస్సై మృతిపై జిల్లాలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తుపాకీ గురిపెట్టడంతో సుశిక్షితుడైన ఎస్సై.. ఆయన చేతిలో అది మిస్ ఫైరైందంటే ఎవరూ నమ్మడం లేదు. అదే విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అన్న అనుమానం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది మరికొందరి వాదన. శాంతిభద్రతలు పరిరక్షించే స్థానంలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇలా పిరికితనంగా తనకు తానే ఎందుకు కాల్చుకుంటాడు? ఒక వేళ మిస్ ఫైరైతే అది పిన్ పాయింట్లోనే ఎందుకు పేలిందనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. మిస్‌ఫైర్ కారణంగానే ఎస్సై మృతి చెందాడని ఉన్నతాధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. ఆందోళనలో పోలీసు వర్గాలు రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్ మరణం పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉత్సాహంగా, చలాకీగా పనిచేసే ఎస్సై.. అప్పటికప్పుడే తుపాకీ మిస్‌ఫైరై మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసు విధులంటే ఆటుపోట్లు సహజమంటున్నారు. ఆరోపణలు, అవమానాలు, పొగ డ్తలు, అవార్డులు, రివార్డులు, ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు, రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు షరా మామూలేనని పేర్కొంటున్నారు. పోలీస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా అరుదని చెబుతున్నారు. ఎస్సై గది సీజ్ ఎస్సై మృతి చెందిన గదిని ఉన్నతాధికారులు సీజ్ చేశారు. గది తలుపులు బిగించి తాళం వేశారు. మిస్‌ఫైర్ కారణంగానే ఎస్సై చనిపోయారని చెబుతున్నా గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజానిజాలు బయటపడే అవకాశం లేకపోలేదు. పేదరికంలో పుట్టి.. ఎస్సైగా ఎదిగి పేదరికంలో పుట్టి పట్టుదలతో ఎస్సై పోస్ట్ సాధించిన విష్ణుగోపాల్.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట బృందావనానికి చెందిన కొల్లా రామారావు పెద్ద కుమారుడు. చిన్న వయసు నుంచే ఆటల్లో రాణించారు. ఎస్సై కావాలన్న కలను విష్ణుగోపాల్ సాకారం చేసుకున్నారు. స్వగ్రాంలో ఆయనకు మంచి పేరు ఉంది. తమ కుమారుడు మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది. -
సమగ్ర దర్యాప్తు చేయించాలి
సురేశ్రావు కుటుంబసభ్యుల డిమాండ్ ఎల్కతుర్తి : తన భర్త, సీఎం చీఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి సురేశ్రావు ఆత్మహత్యపై ఆయన భార్య కవిత, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చీఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి కోదాటి సురేశ్రావు డ్యూటీలోనే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని శనివారం వేకువజామున స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి తీసుకువచ్చారు. మృతదేహంతోపాటు ఇక్కడకు చేరుకున్న కవిత, కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు శాఖ తీరుపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తన భర్త సెలవు పెట్టి వస్తానని మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటినుంచి వెళ్లారని, సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌శాఖ నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఆ రెండు గంటల వ్యవధిలో అక్కడ ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనస్థలంలో మృతదేహాన్ని చూడనివ్వలేదని, పోస్టుమార్టం వద్దకు కూడా అనుమతించలేదని పేర్కొన్నారు. తాము కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా శవాన్ని ఇంటికి పంపిస్తామంటూ వెళ్లగొట్టారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కవిత కోరారు. -
బెదిరిస్తే చర్యలు తప్పవు..
ప్రజాదివస్‌లో ఎస్పీ ఏవీ రంగనాథ్ ఖమ్మం, క్రైం : బెదిరింపులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి. తనకు కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగిందని, రెండు నెలలు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడని, ఈ విషమంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా మార్పురాలేదని, దీంతో మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని, కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అయినా అతనిలో మార్పు రాలేదని ఖమ్మంనగరంలోని ముస్తఫానగర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అందుకు స్పందించిన ఎస్పీ కేసు ఫైల్‌ను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి లేదని, సీఐపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశామని అన్నారు. తాను కష్టపడి సంపాదించిన 26 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు చెరో 12 ఎకరాలు పంచి ఇచ్చానని, వృద్ధాప్యంలో తనకు జీవనోపాధి కోసం రెండు ఎకరాలు ఉంచుకున్నాని, ప్రస్తుతం తన వయసు 90 సంవత్సరాలని, భూమి అమ్ముకునేందుకు కుమారుడు అడ్డుపడి బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కొణిజర్లకు చెందిన కూచుపూడి వెంకయ్య ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన ఎస్పీ.. బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని, వారిద్దరిని పిలిచి విచారించి తగిన సమాచారం ఇవ్వాలని వైరా సీఐను ఆదేశించారు. తాను ఉయ్యూరు నుంచి ఖమ్మం వస్తూ వైరాలో తోపుడుబండి వద్ద టిఫిన్ చేద్దామని ఆగగా ద్విచక్ర వాహనంపై మఫ్టీలో వచ్చిన ఎస్ఐ అభ్యం్తతరకరంగా మాట్లాడుతూ సర్వీస్ రివాల్వర్‌తో తలపై దాడి చేశాడని, తనకు న్యాయం చేయాలని ఖమ్మానికి చెందిన నవీన్‌కుమార్ ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన ఎస్పీ ... వైరా ఎస్ఐను ఖమ్మం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని వైరా డీఎస్పీని ఆదేశించారు. అలాగే కానిస్టేబుల్‌ను ఏజెన్సీ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని తెలిపారు. కానిస్టేబుల్ కుమారుడికి అభినందన... త్రివేణి పాఠశాలలో పదో తరగతి చదివి 10కి 10 జీపీఏ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లయ్య కుమారుడు బొడ్డు మహేష్‌ను, అలాగే 10కి 10 జీపీఏ సాధించిన ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు కుమారుడు గుంటుపల్లి మనోజ్‌కుమార్‌ను ఎస్పీ ఏవీ రంగనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సత్యకుమార్, ఆర్ ఎస్ఐ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.