ముంబై: విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర జలానా జిల్టాలోని సూపరింటిండెంట్ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్ పథాడే (32) తన సర్వీసు రివాల్వర్ తో శనివారం ఉదయం కాల్చుకొని చనిపోయాడని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. అనంతరం తోటి ఉద్యోగులు ప్రభాకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కారణాలు తెలియాల్సి ఉంది.