టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు | Man kills wife in Odisha over delay in serving tea | Sakshi
Sakshi News home page

టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు

Published Fri, Aug 22 2014 12:27 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు - Sakshi

టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు

భువనేశ్వర్: టీ ఇవ్వటంలో ఆలస్యం చేసిందని భార్యను హతమార్చాడో కిరాతక భర్త. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్కు 110 కిలోమీటర్ల దూరంలోని దెన్కనల్ జిల్లా గుహలిపుల్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... మహలి నాయక్ (56) సోమవారం ఉదయం భార్య ఝనాను టీ కావాలని అడిగాడు.

అయితే టీ చేసి ఇవ్వటంలో జాప్యం కావటంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో అతడు భార్యతో వాగ్వివాదానికి దిగాడు. అతి కాస్తా తీవ్రతరం కావటంతో ఆమె భర్తకు వంట చేసి, వడ్డించేందుకు నిరాకరించింది. ఇదే విషయంపై బుధవారం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగటంతో కోపోద్రిక్తుడైన మహలి నాయక్ బుధవారం రాత్రి పదునైన ఆయుధంతో భార్య హతమార్చాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement