మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడు | wife killed by husband in nalgonda distirct | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడు

Published Sat, Apr 9 2016 11:10 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

wife killed by husband in nalgonda distirct

హుజూర్‌నగర్: మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి భార్యపై దాడి చేసి ఆమెను దారుణంగా హతమార్చాడో భర్త. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ గోవిందాపురంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పచ్చిపాల లింగయ్య, నాగమణి(28) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన లింగయ్య తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన లింగయ్య నిద్రిస్తున్న నాగమణి తలపై రాడ్ తో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement