వెంకటాయపాలెం(రామచంద్రపురం) :కట్టుకున్న భర్తే కాలయముడై ఆమెను అంతమొందించిన విషాద సంఘటన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం ఎస్సీ పేటకు చెందిన తాతపూడి సత్యనారాయణ అలియాస్ సత్తికొండ, వెంకటాయపాలెం శివారు బొడ్డువారిపేటకు చెందిన చిన మంగను (43) ఇరవై ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్లవరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం సత్తికొండ భార్యను వేదింపులకు గురిచేసేవాడు. నాలుగేళ్లుగా వీరిద్దరూ విడి గా జీవిస్తున్నారు. చినమంగ కుమారులు శ్రీను, రమేష్‌లతో కలిసి వేరుగా ఉంటున్నారు.
అప్పుడప్పుడు సత్తికొండ ఉంటున్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చినమంగ ఆమె కుమార్తె ఇంటికి జి.మామిడాడ వెళ్లింది. అక్కడకు వెళ్లిన భర్త సత్తికొండతో కలిసి బుధవారం ఉదయం వెంకటాయపాలెం తిరిగి వచ్చారు. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవటంతో భార్య తలను గోడకు ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ద్రాక్షారామ ఎస్సై కె.వంశీధర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్న కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
భార్యను హతమార్చిన భర్త
Published Fri, Jan 29 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement