నీ వెంటే నేనూ.. | In the face of the death of the husband, wife sucide | Sakshi
Sakshi News home page

నీ వెంటే నేనూ..

Published Wed, Mar 1 2017 9:14 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

In the face of the death of the husband, wife sucide

► భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృత్యువాత
►మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి 
►ఆప్యాయతకు దూరమైన ఇద్దరు చిన్నారులు
►నల్లగొండలో విషాదఛాయలు
 
నలగొండక్రైం: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ బాలింతరాలు మృతిచెందింది. వివరాలు.. నకిరేకల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేశ్‌ కుటుంబం పట్టణంలోని సావర్కర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఇతడి భార్య హేమలత నిండు గర్భిణి కావడంతో ప్రసవానికి ఇటీవల పుట్టింటికి విజయవాడకు వెళ్లింది. అయితే గత నెల 26వ తేదీన పట్టణంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేశ్‌ (30) దుర్మరణం చెందాడు.
 
ఆ విషయాన్ని అతడి భార్య హేమలత (25)కు చెప్పలేదు. మంగళవారం మధ్యాహ్నం హేమలత మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులందరూ విషాదంలో ఉండడంతో ఏం జరిగిందని హేమలత వారిని ప్రశ్నించింది. సురేశ్‌ మృతి చెందిన విషయం తెలుసుకుని గుండెలు బాదుకుని ప్రాణాలు విడిచింది. మూడు రోజుల క్రితమే తండ్రి, నేడు తల్లికూడా మృత్యుఒడికి చేరడంతో అప్పుడే పుట్టిన పసికందును చూసి బంధువులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement