నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యను గోంతుకోసి కడతేడ్చాడో భర్త. ఈ సంఘటన నల్గొండ జిల్లా దండెంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ(47), ఇందిరమ్మ(42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి మద్యం సేవించిన సత్యనారాయణ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ముంజ కొడవలితో భార్య పై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరమ్మను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.