భార్యను చంపేశానని ఒప్పుకున్న భర్త రాములు
పొందూరు: తన కోర్కె తీర్చలేదనే కారణంతోనే భార్యను చంపేశానని గారపేట గ్రామానికి చెందిన రాములు ఒప్పుకున్నాడు. గారపేట గ్రామంలో భార్యను చంపిన భర్తను స్థానిక పోలీసు స్టేషన్‌లో క్రైమ్ పోలీసులు ఆదివారం విచారించారు. ఎటువంటి తడబాటు లేకుండా భార్యను ఎలా చంపాడో హెడ్ కానిస్టేబుల్ రాజుకు రాములు వివరించాడు. తన కోర్కె తీర్చలేదనే కారణంతో చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంటి గడపలో నిద్ర మత్తులో ఉన్న భార్య మెడకు గట్టిగా చీరను చుట్టేసి లాక్కొని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి చంపేశానని చెప్పాడు. మెడమీద, పొట్టమీద కాళ్లుతో మట్టేసి తన్నేశానని తెలిపాడు.
ఆమె విడిపించుకోకుండా ఉండేందుకు చేతులును, కాళ్లును కదలకుండా కట్టేశానని చెప్పాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఫ్యాన్‌కు ఉరేయడంతో మరణించిందని తెలిపాడు. అయితే ఇదంతా తాగిన మైకంలో చేశానని చెప్పాడు. చిత్ర హింసలు పెట్టినప్పుడు ఆమె అరవలేదా అని పోలీసులు ప్రశ్నిస్తే, అరుస్తున్నప్పటికీ బయటకు శబ్దం రాలేదని పేర్కొన్నాడు. దీనిని బట్టి మెడను ఎంత బిగుతుగా ఇరించేశాడో అర్ధమవుతుంది. గతంలో తన భార్య తల బద్దలు కొట్టి పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిన సంఘటనలు ఉన్నాయని వివరించాడు. ఈ విచారణలో క్రైమ్ పోలీసు కానిస్టేబుల్‌లు కె.సి.రాజు, తారక్, స్థానిక పోలీసులు ఉన్నారు.
కోర్కె తీర్చలేదనే...
Published Mon, Jul 6 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement