అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చాయాపురంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్యను గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతురాలి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య నెలకొన్న కలహాలే ఆ ఘటనకు కారణమని పోలీసులు విచారణలో స్థానికులు వెల్లడించారు.