Women Killed Her Lover Second Wife Because Of Extramarital Affair In Madhya Pradesh - Sakshi
Sakshi News home page

అప్పటికే రెండు పెళ్లిలు.. మరో మహిళతో ఎఫైర్‌.. లవర్‌ కోసం ఆమె..

Aug 11 2022 6:41 PM | Updated on Aug 11 2022 7:23 PM

Women killed Her Lover Second Wife Because Of Extramarital Affair - Sakshi

వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. క్షణ కాలం సుఖాల కోసం కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడి కోసం ప్రియురాలు.. ఎవరూ చేయని పనిచేసింది. తన లవర్‌ రెండో భార్యను హత్య చేసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. దేవాస్‌ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల కిందటే నీలం అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, బబ్లూ.. తన మొదటి భార్యకు తెలియకుండా ఈ ఏడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన నీలం.. అతడిని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

ఇదిలా ఉండగా ఓ రోజు బంగారం కొనేందుకు బబ్లూ.. జ్యుయలరీ షాపునకు వెళ్లాడు. ఈ క్రమంలో రీతూ గౌర్‌తో పరిచయం ఏర్పడింది. అయితే, రీతూ గౌర్‌కు వివాహమై ఓ పాప కూడా ఉంది. ఇక, వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధాన్ని దారి తీసింది. ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. కాగా, ఓరోజు తన రెండో భార్యతో ఉన్న సమస్యలను రీతూకు చెప్పాడు. తన పోరు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 

లవర్‌ ఆవేదనను అర్థం చేసుకున్న రీత్‌.. తనను ఓదార్చింది. అనంతరం, ఇద్దరూ కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. రీత్‌.. రాణిని చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రచించింది. మరో మహిళతో కలిసి జాకెట్‌ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లి.. గొంతు నులిమి హత్య చేసింది. ప్లాన్‌లో భాగంగా బబ్లూ ఏమైందో తెలియనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం, పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు.. బబ్లూను గట్టిగా ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో, ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: క్లబ్‌లో యువతులతో అనుచిత ప్రవర్తన.. తాకరాని చోట టచ్‌ చేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement