భార్యను చంపిన భర్త | wife murdered by husband in srikakulam district | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Published Sat, Oct 22 2016 4:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గడ్డపారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో భర్త.

లావేరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గడ్డపారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో భర్త. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిసెట్టిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కలిసెట్టి సత్యం, సత్తమ్మ(45) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కోపోద్రిక్తుడైన సత్యం పక్కనే ఉన్న గడ్డపారతో ఆమె తలపైన బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement