బాలికపై ముగ్గురి అత్యాచారం | girl gang raped by three in hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై ముగ్గురి అత్యాచారం

Published Thu, Sep 4 2014 1:42 AM | Last Updated on Fri, Sep 7 2018 1:59 PM

girl gang raped by three in hyderabad

వేర్వేరు చోట్ల రెండు రోజుల్లో అఘాయిత్యం
చాంద్రాయణగుట్టలో దారుణం
పోలీసుల అదుపులో నిందితులు

 హైదరాబాద్: స్నేహితురాలితో ఫంక్షన్‌కు వచ్చిన ఓ అమ్మాయి రెండు రోజుల్లో మూడుసార్లు వేర్వురుచోట్ల వేర్వేరు వ్యక్తుల చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన బుధవారం వెలుగు చూసింది.  ఈ దారుణానికి కారకులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇన్‌స్పెక్టర్ ఎన్.రామారావు కథనం ప్రకారం.. కందికల్‌గేట్ జీఎం చావునీకి చెందిన బాలిక (14) గత నెల 31న సాయంత్రం 7 గంటలకు స్నేహితురాలితో కలసి దుర్దానా హోటల్ ప్రాంతానికి బయలుదేరింది. అదే ప్రాం తంలో  డైరీఫామ్‌లో పని చేసే ఆమెకు పరిచయమున్న ఓ అబ్బాయి(17) బాలికను బలవంతంగా డైరీఫామ్‌కు తీసుకెళ్లాడు.  ఆమె వెంట ఉన్న మరో అమ్మాయిని డైరీఫామ్‌కు దూరంగా రోడ్డుపై ఉండమని హెచ్చరించాడు. తరువాత  బాలికపై అత్యాచారానికి పాల్పడి బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించి పంపాడు. అక్కడి నుంచి బయటపడ్డ ఆ అమ్మాయి తన స్నేహితురాలున్న చోటుకు చేరుకుంది. ఇద్దరూ చాంద్రాయణగుట్ట చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ సయీద్ అనే మరో యువకుడు వీరిని ఆటోలో  బార్కాస్ ఫీలిదర్గా ప్రాంతంలోని ఒక  శ్మశానానికి తీసుకె ళ్లాడు.  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సయీద్ బెదిరింపులకు గురైన ఆ అమ్మా యి తిరిగి తన స్నేహితురాలితో కలసి  దుర్దానా హోటల్ వద్దకు  వెళ్తుండగా స్నేహితురాలి సోదరుడు వచ్చి ఇద్దరినీ మందలించి తన చెల్లెలును తీసుకెళ్లాడు. భయాందోళనలో ఉన్న బాధిత బాలిక ఇంటికి వెళ్లలేదు. కూతురు కనిపించ డంలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు  నమోదు చేశారు.  మరుసటి రోజు ఉదయం బాధిత బాలికను హబీబ్(40) అనే ఆటోడ్రైవర్ ఆటోలో ఎక్కించుకుని తెలిసిన మహిళ ఇంట్లో ఉంచాడు. ఆ రోజు రాత్రి బాలికను ఆటోలో ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు (2వ తేదీ) తెల్లవారుజామున హబీబ్ సదరు బాలికను ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో బాలిక సాయంత్రానికి ఇల్లు చేరింది. రెండు రోజులపాటు ఎక్కడికి వెళ్లావంటూ కుటుంబ సభ్యులు నిలదీయగా బాలిక జరిగిన విషయా న్ని తెలిపింది. బాలిక తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు మంగళవారంరాత్రి చేరుకొని ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement