
సాక్షి, హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 13తులాల బంగారం, 27 వేల నగదు, 10 తులాల వెండి, 2 సెల్ ఫోన్లను చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.