
సాక్షి, చాంద్రాయణగుట్ట: వేధింపులకు గురిచేస్తూ ఇంటి నుంచి గెంటేసిన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ గృహిణి ధర్నాకు దిగారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మెహదీపట్నానికి చెందిన చెందిన శృతిరేఖకి లలితాబాగ్‌కు చెందిన కరణ్ కేస్వానీతో 2018 జూన్ 18న వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారంతోపాటు కట్న కానుకలు ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నప్పటికీ.. అనంతరం కరణ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. తక్కువ కులం దానివని, అందంగా లేవని, అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. ఇలా ఎనిమిది నెలల నుంచి అత్తింటికి రాకుడా అడ్డుకుంటున్నాడు. దీంతో ఆమె మహిళా సంఘం నాయకురాళ్లతో కలిసి శనివారం కరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ధర్నా చేస్తుందన్న విషయం తెలుసుకున్న ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ ఆర్ విద్యాసాగర్ రెడ్డి ఆమెను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment