గతంలో క్రీడలు, సినీ గ్లామర్‌తో అభిమానుల మన్ననలందుకున్న క్రీడాకారులు, సినీ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వీరిలో కొందరుహిట్టవ్వగా.. మరికొందరు ఫట్ అన్నారు. ఇంకొందరు రాజకీయచతురత కొరవడి చతికిలపడిన వారూ ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోఓ క్రీడాకారుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాడీబిల్డర్ విభాగంలో ఎన్నో పతకాలను సాధించి తనకంటూ ప్రత్యేకతనుసాధించుకున్న ఇసా బిన్ ఒబేద్ మిస్రీ కాంగ్రెస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా చాంద్రాయణగుట్ట బరిలో నిలిచారు. ఇక్కడినుంచి వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించిన అక్బరుద్దీన్ ఒవైసీనిఢీకొట్టబోతున్నారు. బాడీబిల్డర్‌గా సత్తా చాటిన ఇసాబిన్ ఒబేద్‌మిస్రీ ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
చాంద్రాయణగుట్ట :పాతబస్తీ కాజీపురాకు చెందిన ఇసా బిన్ ఒబేద్ మిస్రీ తండ్రి రెజ్లర్ (మల్లయోధుడు). మిస్రీ 18వ ఏటనే బాడీ బిల్డర్‌గా మారారు. అంచలంచెలుగా ఎదుగుతూ మూడు దశాబ్దాల కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకున్నారు. ప్రముఖ బాడీ బిల్డర్‌గా మారిన ఇతనికి ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమంలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అహ్మద్ బిన్ ఇసా మిస్రీ, ఉస్మాన్ బిన్ ఇసా మిస్రీలు సైతం బాడీ బిల్డర్లే. ఇసా మి్రïసీకి బండ్లగూడలో ఫంక్షన్ హాళ్లతో పాటు కాజీపురాలో జిమ్ వ్యాపారం ఉంది.
మార్పు తెచ్చేందుకే..
పాతబస్తీలో మజ్లీస్ పార్టీ హిందు, ముస్లింల నడుమ చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. ఈ విధానానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా. గతంలో నాలుగు పర్యాయాలు విజయం సాధించిన అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్ ఓడించినట్లుగానే.. నాలుగుసార్లు గెలుస్తూ వచ్చిన అక్బరుద్దీన్‌ను నేనూ ఓడిస్తా. ప్రజలంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. – ఇసా బిన్ ఒబేద్ మిస్రీ
Comments
Please login to add a commentAdd a comment