
సాక్షి, హైరదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఇవ్వటానికి 4 నెలలు పట్టిందని, అలాంటి పార్టీ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మత సామరస్యం ఉండదంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
భారతదేశంలో 24గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నొక్కిఒక్కానించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత శిశు మరణాలు తగ్గాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment