సమస్యల్ని గాలికి వదిలేసి ఊరేగుతున్న సీఎం, మంత్రులు : కేటీఆర్‌ | KTR Fires On Revanth Reddy Over Former Sarpanch's Arrest | Sakshi
Sakshi News home page

సమస్యల్ని గాలికి వదిలేసి ఊరేగుతున్న సీఎం, మంత్రులు : కేటీఆర్‌

Published Mon, Nov 4 2024 10:16 AM | Last Updated on Mon, Nov 4 2024 10:53 AM

KTR Fires On Revanth Reddy Over Former Sarpanch's Arrest

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఊరేగుతున్నారని మండిపడ్డారు.

పెండింగ్‌ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచ్‌లు ఇవాళ పిలుపు నిచ్చిన ‘చలో హైదరాబాద్‌ పోరుబాట’ ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్ పెద్దమ్మ గుడి నుంచి ఇవాళ సర్పంచుల పోరుబాట కార్యక్రమం ప్రారంభం కానుంది.

అయితే, చలో హైదరాబాద్ పోరుబాటపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్‌ పెద్దమ్మ గుడి పిలుపుపై అప్రమత్తమైన పోలీసులు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారి అరెస్ట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

 రాష్ట్ర వ్యాప్తంగా  మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి  ముఖ్యమంత్రి,  మంత్రులు ఊరేగుతున్నారు.

సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి  తూట్లు పొడిచి  నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌ల‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కేటీఆర్ ఎక్స్ వేదకగా ట్వీట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement