
లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.