మూడు లారీల పశుమాంసం పట్టివేత | 3 lorries of mutton seized and 115 held in cordon and search at old city | Sakshi
Sakshi News home page

మూడు లారీల పశుమాంసం పట్టివేత

Published Tue, Nov 24 2015 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీలో పశుమాంసం, ఎముకలు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీలో పశుమాంసం, ఎముకలు..

- 115 మంది అదుపులోకి
- ఓల్డ్ సిటీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
- పలు చీకటి దందాలు వెలుగులోకి

హైదరాబాద్:
అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పశుమాంసం ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిపిన కార్డన్ అండ్ అండ్ సెర్చ్ లో పలు చీకటి దందాలు వెలుగులోకి వచ్చాయి.

సౌత్ జోన్ డీసీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసు సిబ్బంది.. ఇస్మాయిల్ నగర్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా, జపాన్‌లకు పశుమాంసాన్ని అక్రమంగా ఎగుమతి చేసే కబేళా ఒకటి వెలుగు చూసింది. మూడు లారీల పశుమాంసం, ఎముకలను స్వాధీనం చేసుకుని ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. తమిళనాడులో చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణాన్ని సీజ్ చేశారు.

ఎలాంటి దృవపత్రాలు లేని అనుమాస్పద వ్యక్తులతోపాటు మయన్మార్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 115 మందిని అదుపులోకి తీసుకున్నామని, సరైన పత్రాలులేని 90 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ సత్యానారాయణ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement