kanchanbagh police station
-
Hyderabad: రాజాసింగ్‌కు షాక్..కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. నగరంలోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో రాజాసింగ్‌పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
ఫేక్ ఐడీతో బురడీ కొట్టించాడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ మోసగాళ్లు పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త పంధాతో అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. తాజాగా నగరంలోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో నయా ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. షాపులో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన కేటుగాడు.. పేటీఎం ఫేక్ ఐడీ ద్వారా చెల్లింపులు చేసినట్లు షాపు యజమానిని బురడీ కొట్టించాడు. నిందితుడి ఫోన్లో వచ్చిన మెసేజ్‌ను చూసి డబ్బులు జమయ్యాయని భావించిన బాధితుడు.. తీరా అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కంచన్ బాగ్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆన్లైన్ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 28 వేల రూపాయల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మూడు లారీల పశుమాంసం పట్టివేత
- 115 మంది అదుపులోకి - ఓల్డ్ సిటీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - పలు చీకటి దందాలు వెలుగులోకి హైదరాబాద్: అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పశుమాంసం ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిపిన కార్డన్ అండ్ అండ్ సెర్చ్ లో పలు చీకటి దందాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ జోన్ డీసీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసు సిబ్బంది.. ఇస్మాయిల్ నగర్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా, జపాన్‌లకు పశుమాంసాన్ని అక్రమంగా ఎగుమతి చేసే కబేళా ఒకటి వెలుగు చూసింది. మూడు లారీల పశుమాంసం, ఎముకలను స్వాధీనం చేసుకుని ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. తమిళనాడులో చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఎలాంటి దృవపత్రాలు లేని అనుమాస్పద వ్యక్తులతోపాటు మయన్మార్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 115 మందిని అదుపులోకి తీసుకున్నామని, సరైన పత్రాలులేని 90 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ సత్యానారాయణ వివరించారు. -
స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్
* ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు * రాజీకి రావాలంటూ బాధిత కుటుంబానికి ఫోన్లు * లేకుంటే రేప్ దృశ్యాలు నెట్లో పెడతామని బెదిరింపు * గత నెలలో జరిగిన ఘటన సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ తరహాలోనే కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఘోరం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసుల అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గ్యాంగ్‌రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలని లేకుంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని పరారీలో ఉన్న నిందితుడు.. బాధితులను బెదిరిస్తున్నాడు. అయితే వారి బెదిరింపులకు భయపడకుండా బాధితురాలు తన తల్లితో కలిసి ఆదివారం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాబానగర్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోవడంతో దుబాయ్‌లో పనిమనిషిగా చేస్తుంది. ఆమె 15 ఏళ్ల కూతురు బాబానగర్లోనే ఉంటుంది. స్థానికంగా ఉన్న ఒక టైలరింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంది. కూతురు బాగోగులు చూసేందుకు బంధువైన అయూబ్‌కు నెలనెలా ఆమె డబ్బులు పంపేది. కాగా, గత నెల 5వ తేదీన బాలిక శిక్షణ ముగించుకుని ఇంటికి వస్తుండగా అషఫ్ అలీ అలియాస్ చందు, అయూబ్‌లు ఆటోలో బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తామని, కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరించారు. దీం తో భయపడిన బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే గత నెల 14న దుబాయ్ నుంచి తల్లి రావడంతో జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పింది. దీంతో ఆమె కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చందు ( అషఫ్ ్రఅలీ)ను మాత్రమే అరెస్టు చేశారు. అయూబ్‌ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. నిందితుడు అయూబ్ అతని అనుచరులు షకీల్, అసద్‌లు పోలీసులకు చిక్కకుండా కేసు రాజీ కుదుర్చుకోవాలని లేదంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నెల రోజుల నుంచి వీరి బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆదివారం తల్లికూతుళ్లు మళ్లీ పోలీసులను ఆశ్రయించి మరో ఫిర్యాదు చేశారు. అయూబ్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరికొందరు బాధితులు అయూబ్, చందు( అషఫ్ రఅలీ)ల అనుచరుల చేతిలో పలువురు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారని తల్లి ఆరోపించింది. బాధితులు భయంతో ముందు కు రావడం లేదని, వీరి అరాచకాలను ఇకనైనా అడ్డుకోవాలని కోరుతోంది. వీరి బారిన పడిన కొంత మంది బాధితుల వివరాలను పోలీసులకు కూడా చెప్పాను.