సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ మోసగాళ్లు పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త పంధాతో అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. తాజాగా నగరంలోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో నయా ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. షాపులో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన కేటుగాడు.. పేటీఎం ఫేక్ ఐడీ ద్వారా చెల్లింపులు చేసినట్లు షాపు యజమానిని బురడీ కొట్టించాడు. నిందితుడి ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ను చూసి డబ్బులు జమయ్యాయని భావించిన బాధితుడు.. తీరా అకౌంట్‌లో డబ్బులు జమ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కంచన్ బాగ్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 28 వేల రూపాయల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment