Cordon and search
-
భువనగిరి అర్బన్ కాలనీలో కార్డన్ సెర్చ్
భువనగిరిఅర్బన్ : భువనగిరిలోని అర్బన్‌కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాంచంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కాలనీలో ఎక్కువ మంది అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులు ఉన్నం దున నిఘా పెంచినట్టు చెప్పారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 34 బైక్‌లు, 6 ఆటోలు, 6 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే 8 మంది రౌడీషీటర్లు, ఆరుగురి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చె ప్పారు. అర్బన్‌కాలనీలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 3 పెట్టెల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. కార్డన్ సెర్చ్‌కు కాలనీ ప్రజలు సహకరించా రని, ఇక ముందు కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ జితేందర్‌రెడ్డి, 8 మంది సీఐలు, 15మంది ఎస్ఐలు, 150 కానిస్టేబుల్ పాల్గొన్నట్లు చెప్పారు. -
పోలీసులు అదుపులో కరడుగట్టిన నేరస్థులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 250 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తాము అదుపులోకి తీసుకున్న 15 మంది అనుమనితులో ముగ్గురు కరడుగట్టిన నేరస్థులున్నారని సమాచారం. నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున ఒమర్ అనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని 300 ప్యాకెట్ల కార్బైడ్‌ని సీజ్ చేశారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు సహకరించాలని పాతబస్తీ ప్రజలను కోరినట్లు డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. -
బుర్హాన్ వనీ వారసుడి హతం
-
వనీ వారసుడి హతం
హిజ్బుల్ కమాండర్ సబ్జార్ భట్ ఎన్కౌంటర్ ► కార్డన్ అండ్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదుల కాల్పులు ► ఇంటిని చుట్టుముట్టి అంతమొందించిన భద్రతా బలగాలు ► యువత ‘ఉగ్ర’ ఆకర్షణలో భట్ పాత్ర కీలకం ► రాంపూర్ సెక్టార్లో ఆరుగురు మిలిటెంట్ల ఎన్కౌంటర్ శ్రీనగర్: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ (26)ను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. హిజ్బుల్ మాజీ కమాండర్ బుర్హాన్ వనీ హతమయ్యాక లోయలో ఉగ్ర కార్యక్రమాల్లో కీలకంగా మారిన భట్‌ను శనివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. దీంతో ఉగ్రవాద విస్తరణను అడ్డుకోవటంలో భద్రతాబలగాల ప్రయత్నం మరో అడుగు ముందుకుపడింది. కరడుగట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత లోయలో హిజ్బుల్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటంలో, యువతను ఆకర్షించటంలో భట్ క్రియాశీలకంగా వ్యవహరించాడు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సబ్జార్తోపాటుగా మరో మిలిటెంట్ హతమయ్యాడు. మరికొందరు హిజ్బుల్ ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో త్రాల్‌లోని సైమూ గ్రామంలో ఆర్మీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. కాగా, ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సమయంలో బుల్లెట్ గాయాలైన ఓ స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సబ్జార్ ఎన్‌కౌంటర్‌తో లోయలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు, రాంపూర్ సెక్టార్లో భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆరుగురు మిలిటెంట్లను కూడా సరిహద్దు బలగాలు మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్ ఎలా జరిగింది? లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఏరివేసేందుకు అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను ఆర్మీ విస్తృతం చేసింది. శ్రీనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలోని పుల్వామా జిల్లా సైమూ గ్రామంలోనూ కార్డన్ సెర్చ్ కోసం భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి వచ్చాయి. గ్రామంలోని ఓ వీధి గుండా వెళ్తుండగా.. సమీపంలోని ఇంటినుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చుట్టుముట్టాయి.కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదులు పక్కనున్న ఓ పాత భవనంలోకి, దాని పక్కనున్న మరో ఇంట్లోకి ప్రవేశించారు. దీన్ని గమనించిన బలగాలు ఆ రెండు ఇళ్లను చుట్టుముట్టడంతోపాటుగా గ్రామంలోని మిగిలిన ఇళ్లలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అయితే శుక్రవారం రాత్రి కాసేపటికి కాల్పులు ఆగిపోయాయి. లోపలున్న ఉగ్రవాదులను తప్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, రాళ్లు రువ్వుతూ భద్రతా బలగాల దృష్టి మరల్చేందుకు విఫలయత్నం చేశారు. వారిపై పోలీ సులు పెల్లెట్లు, బాష్పవాయును ప్రయోగించారు. పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. శనివారం వేకుజామున ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు ప్రారంభించటంతో ఆర్మీ దీటుగా స్పందించింది. రెండు ఇళ్లనుంచి దట్టమైన మంటలు వ్యాపించటంతో ఉగ్రవాదులు పొగలో చిక్కుకుపోయారు. తర్వాత బలగాలు వీరిని మట్టుబెట్టాయి. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇళ్ల శిథిలాల మధ్య మూడో ఉగ్రవాది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏడాదిలో రెండో భారీ దెబ్బ వనీ ఎన్కౌంటర్ తర్వాతే భట్‌కు హిజ్బుల్ పగ్గాలు అందుతాయని భావించినా.. ఈ బాధ్యతలు జకీర్ ముసాకు అప్పగించారు. కానీ మే ప్రారంభంలో హురియత్ నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేసిన మూసా హిజ్బుల్ బాధ్యతలనుంచి తప్పుకోవటంతో భట్‌కు వనీ వారసుడి స్థానం దక్కింది.ముసా మొదట్నుంచీ కాగితం పులేనని.. భట్ తెరవెనక ఉండి మొత్తం నడిపించేవాడని పోలీసు అధికారులు తెలిపారు. ముసా కన్నా భట్టే భద్రతాబలగాలు, పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని వెల్లడించారు. గతంలోనే భట్ తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. కాగా, 11 నెలల కాలంలోనూ ఇద్దరు హిజ్బుల్ కీలకమైన నేతలను మట్టుబెట్టడం లోయలో ఉగ్ర వ్యతిరేక కార్యక్రమాలకు మరింత ఊపునివ్వనుంది. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌తో లోయలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజుల పాటు బంద్ పాటించాలని హురియత్ పిలుపునిచ్చింది. అనంత్‌నాగ్, పుల్వామా, శ్రీనగర్‌తోపాటు పలు జిల్లాల్లో ఇప్పటికే ఆందోళనలు మిన్నంటాయి. చాలా చోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై యువకులు రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. చొరబాటు కుట్ర భగ్నం నియంత్రణ రేఖ వెంబడున్న రాంపూర్ సెక్టార్లో చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భధ్రతా బలగాలు మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారుజామున సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదులు ప్రతిఘటించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆరుగురిని బలగాలు హతమార్చాయని ఆర్మీ వెల్లడించింది. మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉండొచ్చన్న సమాచారంతో సరిహద్దుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. తాజా ఘటనతో 24 గంటల్లో లోయలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 10కి చేరింది. శుక్రవారం ఉడీ సెక్టార్లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు బ్యాట్ (పాకిస్తాన్ సరిహద్దు దళం) సభ్యులను బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఎవరీ భట్ ? కశ్మీర్ లోయలో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించాలంటే.. యువతతో తరచూ కలుస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి. భట్ ఇందుకు పూర్తి విరుద్ధం. తను లోప్రొఫైల్ కొనసాగిస్తూనే చురుకుగా వ్యవహరించేవాడు. ఫొటోల్లో, ఇతర వేదికలపై తాను బహిరంగంగా కనిపించకుండానే పని చక్కబెట్టేవాడు. ఏడాదిన్నర క్రితం హిజ్బుల్‌లోకి రాకముందే లోయలో రాళ్లు విసురుతున్న యువకుల్లో భట్ ఒకడు. ఇదే సమయంలో పెళ్లి ప్రతిపాదన తిరస్కరణకు గురవటంతో ఉగ్రవాదంవైపు ఆకర్షితుడై తక్కువ సమయంలోనే బుర్హాన్ వనీకి అత్యంత సన్నిహితుడయ్యాడు. త్రాల్‌లోని రథ్సునా గ్రామానికి చెందిన భట్ దక్షిణ కశ్మీర్లో హిజ్బుల్ విస్తరించటంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. లోయలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించటంలో బుర్హాన్ వనీతోపాటుగా సబ్జార్ భట్ పాత్ర చాలా కీలకం. సోషల్ మీడియా ద్వారా యువతకు గాలం వేసి, జవాన్లపై దాడికి ఉసిగొల్పటంలో వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరించారు. లోయలోని హిజ్బుల్ బృందంలో వనీకి భట్ అంటేనే చాలా నమ్మకం. సాంకేతికతను వినియోగించుకుని ఉగ్రకార్యక్రమాలను రూపకల్పన చేయటంలో భట్ దిట్ట. వనీ ఎన్కౌంటర్ తర్వాత (గతేడాది జూలై 8న) లోయలో అస్థిరత నెలకొల్పటం భట్ వ్యూహమేనని తెలిపారు. మార్చిలో పుల్వామాలో ఓ ఇంట్లో దాక్కున్న భట్‌తోపాటు మరికొందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్లో.. అప్పటికే ఓ పోలీసుతోపాటు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. స్థానికులు రాళ్లు రువ్వటంతోపాటు ఎన్కౌంటర్ స్థలానికి చొచ్చుకురావటంతో భట్ పారిపోగలిగాడు. ఉగ్రవాదంపై సరికొత్త వ్యూహంతో.. కొంతకాలంగా లోయలో ఉగ్రవాదులను తరచుగా భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ప్రత్యర్థుల అంచనాలను తిప్పికొడుతున్నాయి. శనివారం నాటి భట్ ఎన్‌కౌంటర్‌తో లోయలో పరిస్థితుల్లో మార్పు కనబడనుంది. పరిస్థితి మొత్తం ఆర్మీ చేతుల్లోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం. ఆర్మీ వ్యూహంలో ఇంతలా మార్పు రావటానికి కారణమేంటి? అదే మాజీ బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ పటేల్ అనుసరించిన వ్యూహం. 1990–93 మధ్యలో పటేల్ లోయలో మిలిటెన్సీని నియంత్రించారు. నిఘా సమాచారం ఆధారంగా ఉగ్ర నేతలను మట్టుబెట్టడంపైనే దృష్టిపెట్టారు. సమాచారం రాగానే కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టడం ఆపరేషన్ పూర్తి చేయటం పటేల్ వ్యూహం. ముస్లిం జాన్బాజ్ ఫోర్స్, జేకేఎల్ఎఫ్, హిజ్బుల్లా వంటి గ్రూపుల నేతలను లక్ష్యం చేసుకుని ఈ సంస్థలను సమూలంగా నిర్మూలించారీయన. ఆ తర్వాత పాకిస్తాన్.. లష్కరే, హుజీలను కశ్మీర్‌కు పంపించింది. పదేళ్ల క్రితమే ఇవి కూడా ఉనికిని కోల్పోయాయి. ఐదేళ్ల క్రితం కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే.. భట్ ఎన్‌కౌంటర్‌తో సంబరాలు జరుపుకోదలచుకోలేదని.. జూన్ చివరి వారం, జూలై మొదటి వారం తమకు చాలా కీలకమని దక్షిణ కశ్మీర్లో ఆపరేషన్లు చేస్తున్న విక్టర్ ఫోర్స్ చీఫ్, మేజర్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. భట్ మృతితో హిజ్బుల్‌లో తీవ్రమైన నాయకత్వ సమస్య నెలకొందని.. లోయలో దీని ప్రభావం చాలా ఉంటుందని రాజు వెల్లడించారు. లోయలో లష్కరే చీఫ్‌గా ఉన్న అబు దుజానా ఈ బాధ్యతలు తీసుకొవచ్చని భావిస్తున్నారు. వనీ ఎన్కౌంటర్ తర్వాత హిజ్బుల్, లష్కరేతోపాటు ఇతర ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి దుజానా చొరవ తీసుకున్నారు. గతవారమే దుజానాను కార్డన్ సెర్చ్‌లో భద్రతా బలగాలు చుట్టుముట్టినా స్థానికుల సాయంతో అతను తప్పించుకున్నాడు. అయితే.. తాజా పరిణామాలతో దుజానాపైనా దృష్టిపెట్టి అతన్ని కూడా మట్టుబెట్టాలని సైన్యం వ్యూహాలు రచిస్తోంది. -
కార్డన్ సెర్చ్.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని టోలీచౌకీ ఏరియా ఐఏఎస్ నగర్, బృందావన్ నగర్, ఫాతిమానగర్ కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 14 మంది నైజీరియన్లు ఉన్నారని వీరిని విచారించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశీయులు నివాసం ఉండే ఇంటి ఓనర్లను అడిగి వారి వివరాలు తెలుసుకుంటామన్నారు. గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 300 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వయించాయి. 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎలాంటి పత్రాలు లేనివిగా గుర్తించిన 103 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా విదేశీయుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం. -
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 25మంది
-
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 25మంది
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కమేళ, మెయిన్ పురా, మిశ్రీ గంజ్ ప్రాంతంలో సౌత్ జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. అక్రమంగా జంతువుల మాంసం విక్రయిస్తున్న 12 కబేళాలపై దాడులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మాంసాన్ని పరిశీలించారు. ఈ దాడుల్లో 25 మంది అనుమానితులు, సరైన ధ్రువపత్రాలులేని 5 ఆటోలు, 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మత్తుపదార్థాలను 300 రూపాయలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆయుబ్ఖాన్ అనుచరులే లక్ష్యంగా కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో అర్ధరాత్రి నుంచి కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బుధవారం అర్థరాత్రి నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పాతబస్తీలోని 40 ప్రాంతాల్లో పోలీసులు అణువణువు సోదాలు నిర్వహించారు. ఆయుబ్ఖాన్ అనుచరులే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆయుబ్ ఖాన్ ప్రధాన అనుచరుడు ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు సాంబశివుడు సోదరుడు రాములు హత్యకేసులో నిందితుడు అయిన బాడర్ యూసఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాములు హత్యకేసులో ఏ17గా బాడర్ యూసఫ్ ఉన్న విషయం తెలిసిందే. -
కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు సీజ్
కరీంనగర్: కరీంనగర్ హుస్సేన్‌పురాలో పోలీసులు బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్డన్ సెర్చ్ 9 గంటల సమయంలోనూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 లీటర్ల కిరోసిన్(రేషన్)ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రామారావుల ఆధ్వర్యంలో పదిమంది సీఐలు, 300మంది పోలీసు సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్.. 49 వాహనాలు సీజ్
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ చేపట్టారు. శనివారం వేకువజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సాగిన ఈ తనిఖీలలో నలుగురు ఎస్సైలతోపాటు 70 మంది పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. స్థానిక తుంబాయిగడ్డ ప్రాంతంలో అన్ని ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు కొందరు అనుమానితులను ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలతోపాటు రెండు ఆటోలను సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కార్డన్ సెర్చ్: 250 వాహనాలు స్వాధీనం
వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వజిత్ ఆధ్వర్యంలో డీఎస్పీ సుధాకర్, సీఐలు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది మొత్తం 300మంది దేవస్థానం వసతి గృహాలు, ప్రైవేటు లాడ్జిలు, ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా 90మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేటలో కార్డన్ సెర్చ్.. వాహనాలు సీజ్
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని వీరముష్టికాలనీలో సీపీ శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ చేశారు. తనిఖీలలో భాగంగా సరైన డాక్యుమెంట్లు, ఆధారాలు చూపించని కారణంగా 25 వాహనాలను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. -
1,100 తలుపులు ఎందుకు తట్టారంటే..
హైదరాబాద్: ‘రెండు కమిషనరేట్ల సరిహద్దుల్లో తిష్ట వేసి ఉంటున్న నేరస్తులు కార్డాన్‌సెర్చ్ సమయంలో పక్క కమిషనరేట్ పరిధిలో తల దాచుకుంటున్నారు... దీనికి చెక్ పెట్టేందుకే రెండు కమిషనరేట్ల సిబ్బందితో బుధవారం వేకువజామున పక్కాగా సోదాలు చేపట్టాం.. మున్ముందు ఇలాంటివే చేపడుతాం..’ దక్షిణ మండలం, శంషాబాద్ డీసీపీలు సత్యనారాయణ, సన్‌ప్రీత్‌సింగ్. దక్షిణ మండలం, శంషాబాద్ జోన్ పోలీసులు సంయుక్తంగా ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్ల సరిహద్దులో ఉన్న హసన్‌నగర్ రోడ్డులో బుధవారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం డీసీపీలు విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాలివీ... కార్డాన్సెర్చ్లో మొత్తం 585 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని రహదారులను దిగ్బంధించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సోదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా 1,100 ఇళ్ల తలుపులు తట్టిన పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలించారు. మొత్తం 101 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు కరుడుగట్టిన రౌడీషీటర్లు, ఒక గుడుంబా విక్రేత, హత్యాయత్నం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ముగ్గురు నిందితులు, 26 మంది బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు నాలుగు తల్వార్లు, మూడు డాగర్లు, 12 మంది బాల కార్మికులు, 120 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, ఒక కారును సీజ్‌చేశారు. పట్టుబడిన 26 మంది బిహారీలంతా ఇంద్రానగర్‌లోని గాజుల తయారీ కర్మాగారంలో పని చేసే బాల కార్మికులు. వీరిని పనిలో పెట్టుకున్న యజమానిపై పి.డి.యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీలు తెలిపారు. పాతబస్తీలో ఇటీవల ఉగ్రవాద అనుమానితులు పట్టుబడిన నేపథ్యంలో ప్రజల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించి వారి భద్రతకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సెర్చ్ చేపట్టామన్నారు. దీంతో పాటు ఈ మధ్య కాలంలో బవారీయా చైన్ స్నాచింగ్ గ్యాంగ్ కూడా పాతబస్తీలో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడ్డారన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నేరాలకు చెక్ పెట్టేందుకు ఈ సోదాలు జరిపామన్నారు. కాగా, ఉగ్రవాద అనుమానితులు పట్టుబడుతున్న నేపథ్యంలో రెండు కమిషనరేట్ల పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్‌లో ఉగ్ర విషయాలకు సంబంధించి ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. -
బంజారాహిల్స్ పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: బంజారాహిల్స్, హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు మీరజ్ కాలనీ, నబీ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 35 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు సరైన పత్రాలు లేని 50 వాహనాలు సీజ్ చేశారు. -
హైదరాబాద్ సౌత్ జోన్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: సౌత్ జోన్ పరిధిలో పోలీసులు శనివారం వేకువజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్, బాబానగర్, కంచన్ బాగ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జంతు కళేబరాలతో ఉత్పత్తులు తయారుచేస్తున్న పరిశ్రమలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకిలీ ఆయిల్ తయారుచేసే రెండు కేంద్రాలపై దాడి చేశారు. పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నార్త్‌జోన్ పరిధిలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ : నార్త్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది. తవాయిపురా, బోయిన్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గురువారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభించిన తనిఖీల్లో120 మంది సాయుధ, సివిల్ పోలీసులు పాల్గొంటున్నారు. ఇల్లిల్లూ గాలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరో రెండు గంటలపాటు సోదాలు కొనసాగనున్నాయి. -
ఆసిఫ్ నగర్ లో కార్డన్ సెర్చ్, 72 మంది అరెస్ట్
హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 72 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితులలో 32 మంది బిహార్ కు చెందిన వారు ఉన్నారని పోలీసులు వివరించారు. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: భాగ్యనగరం విశ్వనగరంగా రూపొందుతున్న క్రమంలో నగరంలో అసాంఘిక శక్తులను గుర్తించడానికి పోలీసులు వరుస నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్లో తూర్పు మండల డిఫ్యూటీ కమిషనర్ వి. రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. పలువురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. -
శ్రీనగర్ కాలనీలో డ్రంకెన్‌డ్రైవ్
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న 21 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో 6 కార్లు, 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. దూద్‌బావిలో కార్డెన్ సెర్చ్ దక్షిణ మండల డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్‌బావిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్‌లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
పాతబస్తీలో అపరేషన్ స్మైల్-2
-
మూడు లారీల పశుమాంసం పట్టివేత
- 115 మంది అదుపులోకి - ఓల్డ్ సిటీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - పలు చీకటి దందాలు వెలుగులోకి హైదరాబాద్: అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పశుమాంసం ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిపిన కార్డన్ అండ్ అండ్ సెర్చ్ లో పలు చీకటి దందాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ జోన్ డీసీసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసు సిబ్బంది.. ఇస్మాయిల్ నగర్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చైనా, జపాన్‌లకు పశుమాంసాన్ని అక్రమంగా ఎగుమతి చేసే కబేళా ఒకటి వెలుగు చూసింది. మూడు లారీల పశుమాంసం, ఎముకలను స్వాధీనం చేసుకుని ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. తమిళనాడులో చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఎలాంటి దృవపత్రాలు లేని అనుమాస్పద వ్యక్తులతోపాటు మయన్మార్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 115 మందిని అదుపులోకి తీసుకున్నామని, సరైన పత్రాలులేని 90 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ సత్యానారాయణ వివరించారు. -
విజయవాడలో కార్డన్ సెర్చ్
విజయవాడ: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులతో పాటు ధ్రువీకరణ పత్రాలు లేని 36 బైకులను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
బేగంబజార్‌లో కార్డన్ సెర్చ్..
హైదరాబాద్: బేగంబజార్ ప్రాంతంలో పోలీసులు మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను జల్లెడపట్టారు. ఓ వాహనాల దొంగతో పాటు, మరో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
నగరంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మీర్ పేట, లెనిన్ నగర్లలో నిర్వహించారు. ఎల్బీ నగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని 24 బైక్ లు, 4 ఆటోలు, 2 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 100 గ్రాముల గంజాయి, 62 క్వార్టర్ల మద్యం పట్టుబడింది. తొమ్మిదిమంది అనుమానితులను, ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా సుమారు 80 మంది ప్రయాణికుల బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. స్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫారాలను జల్లెడపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-నాందేడ్, మహబూబ్‌నగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ తనిఖీలు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని డీఎస్పీ జగదీశ్వరరావు వెల్లడించారు. ప్రతీ రైలును తనిఖీ చేయనున్నామని ఆయన చెప్పారు. -
సైబరాబాద్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హైదరాబాద్ సైబరాబాద్‌లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు బృందాలు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని 9 వాహనాలను సీజ్ చేశారు. 200 మంది పోలీసులు ఏసీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అసాంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు తెలంగాణ పోలీసులు చేపట్టిన కార్డన్ సెర్చ్ కార్యక్రమం మంచి ఫలితాలనివ్వడంతో రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సెర్చ్‌ను కొనసాగిస్తున్నారు. -
ఇంటిలిజెన్స్ హెచ్చరికతో హైదరాబాద్‌లో అప్రమత్తం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ఏమూల ఏ ఉగ్రవాద చర్య జరిగినా దానికి ఏదో ఓ రంకంగా నగరంతో సంబంధం ఉంటూనే ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలోని బాపూజి నగర్లో నార్త్‌జోన్ పోలీసులు గురువారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ సుధీర్ బాబు ఆధ్వార్యంలో 200 మంది పోలీసులతో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ చేపడుతున్నారు. ముఖ్యంగా అద్దెకు ఉంటున్న వ్యక్తుల పూర్తి వివరాలు తీసుకోవాలని డీసీపీ అధికారులకు సూచించారు.