హైదరాబాద్ : హైదరాబాద్ సైబరాబాద్‌లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు బృందాలు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని 9 వాహనాలను సీజ్ చేశారు. 200 మంది పోలీసులు ఏసీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అసాంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు తెలంగాణ పోలీసులు చేపట్టిన కార్డన్ సెర్చ్ కార్యక్రమం మంచి ఫలితాలనివ్వడంతో రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సెర్చ్‌ను కొనసాగిస్తున్నారు.