నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా సుమారు 80 మంది ప్రయాణికుల బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. స్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫారాలను జల్లెడపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అలాగే కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-నాందేడ్, మహబూబ్‌నగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ తనిఖీలు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని డీఎస్పీ జగదీశ్వరరావు వెల్లడించారు. ప్రతీ రైలును తనిఖీ చేయనున్నామని ఆయన చెప్పారు.