nizamabad railway station
-
రైలు ప్లాట్ ఫామ్ మధ్య చిక్కుకొని తండ్రీకూతుళ్ల మృతి
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడి తండ్రి, కూతురు మృతిచెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రాంచందర్‌రావు(40) కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి దేవి దర్శనం కోసం పర్బణి ఎక్స్‌ప్రెస్‌లో బాసరకు సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. రైలులో ఎస్–8 బోగీలో రెండు సీట్లు రాంచందర్‌రావు కూతుళ్లకు రిజర్వ్ కాగా, ఎస్–4 రాంచందర్‌రావు దంపతులకు రిజర్వ్ అయ్యాయి. వీరు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. నిజామాబాద్‌లో ఇతర ప్రయాణికులు దిగిపోవడంతో రాంచందర్‌రావు కూతుళ్లకు ఫోన్ చేసి తమ దగ్గర సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అనంతరం వారిని తీసుకుని తామున్న బోగీలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా పెద్ద కూతురును బోగీలోకి ఎక్కించిన అనంతరం చిన్నకూతురు(14)ను ఎక్కిస్తుండగా రైలు కదలడంతో చిన్నకూతురు రైలుకింద పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో తండ్రికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. రాంచందర్‌రావు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాంచందర్‌రావు బంధువు వేముల మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రైల్వే ఎస్సై తెలిపారు. -
ఇందూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: అయ్యప్ప భక్తుల కోసం రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైలు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 07613 నిజామాబాద్– కొల్లాం రైలు డిసెంబర్ 6న నిజామాబాద్ నుంచి మధ్యహ్నం 12.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 చేరుకుంటుంది. ఈ రైలు కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుత్తని, కట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. ఈ రైలులో సెకండ్, థర్డ్‌క్లాస్ ఏసీ బోగిలు, ఏసీ చైర్‌కారు, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగిలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఔరంగాబాద్– కొల్లాం మధ్య.. వచ్చేనెల 7న ఔరంగాబాద్– కొల్లాం రైలు నం.07505 నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు డిసెంబర్ 7న ఔరంగాబాద్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరి కొల్లాంకు డిసెంబర్ 9న ఉదయం 4.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జాల్నా, సేలు, పర్బణి, పూర్ణ, నాందేడ్, ముత్కేడ్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, చెంగచెర్రి, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. తిరుపతి– ఔరంగాబాద్ మధ్య... తిరుపతి– ఔరంగాబాద్ మధ్య డిసెంబర్ 11న ప్రత్యేక రైలు నడుపనున్నారు. రైలు నం.07410 తిరుపతిలో డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.25 గంటలకు, ఔరంగాబాద్‌కు డిసెంబర్ 12న ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కోడూర్, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, ముద్దనూర్, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూల్ సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మబాద్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్బణి, జల్నా మీదుగా ఔరంగాబాద్‌కు చేరుకుంటుంది. అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని కోరారు. -
‘నా కొడుకును కొనుక్కుంటారా’
ఇంటింటికీ తిరిగిన తల్లి పోషించే స్థోమత లేదంటూ అమ్మకానికి.. ఇందూరు: పోషించే స్థోమత లేదంటూ కొడుకును అమ్మకానికి పెట్టిన ఉదంతం మంగళవారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ‘నా కొడుకును కొనుక్కుంటారా? అంటూ ఓ తల్లి ఇంటింటికి తిరిగి అడుగుతుండడంతో పోలీసులు బాలుడిని, అమ్మకానికి పెట్టిన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌కు చెందిన నక్కల పద్మకు కొన్నేళ్ల క్రితం గంగారాంతో వివాహం జరిగింది. కొడుకు పుట్టిన తర్వాత గంగారాం మరణించడంతో పద్మ మరో పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. వారం రోజుల క్రితం కొడుకు నక్కల దినేష్ (3)తో నిజామాబాద్‌కు రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉంటోంది. మంగళవారం స్థానిక గౌతంనగర్ కాలనీకి వెళ్లిన ఆమె ‘నా బిడ్డను అమ్ముతాను కొంటారా’ అని స్థానికులను అడిగింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో అంబేద్కర్ కాలనీకి వెళ్లి ఇంటింటికి తిరిగి తన బిడ్డను రూ. 20 వేలకు అమ్ముతానని కాలనీవాసులకు చెప్పింది. దీంతో అక్కడి వారు మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వచ్చి ఆమెను, ఆమె వద్ద ఉన్న బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు శిశుగృహకు, తల్లిని స్వధార్ హోంకు తరలించారు. -
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి త్వరలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్
నిజామాబాద్: కరీంనగర్ - నిజామాబాద్ రైల్వే లైన్ ఏడాదిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీవాత్సవ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి త్వరలో న్యూఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్ట్‌ల కోసం కృషి చేస్తామన్నారు. -
రైల్వేస్టేషన్లో పోలీసుల మమ్ముర తనిఖీలు
నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 80 మంది పోలీసులు రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల బ్యాగులను, అన్ని రైళ్లనూ తనిఖీ చేశారు. దీంతో ఎక్కడేం జరిగిందోనని ప్రయాణీకులు ఆందోళన చెందారు. సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ ఎస్.జి. జగదీశ్వరప్ప ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ ఏఆర్, నిజామాబాద్ రైల్వే పోలీసులతోపాటు జిల్లాలోని బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే ప్రతి రైలునూ తనిఖీ చేశారు. ప్రయాణీకులు తమ బ్యాగులు, ఇతర వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని డీఎస్పీ జగదీశ్వరప్ప సూచించారు. -
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా సుమారు 80 మంది ప్రయాణికుల బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. స్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫారాలను జల్లెడపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-నాందేడ్, మహబూబ్‌నగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ తనిఖీలు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని డీఎస్పీ జగదీశ్వరరావు వెల్లడించారు. ప్రతీ రైలును తనిఖీ చేయనున్నామని ఆయన చెప్పారు. -
రైల్వేస్టేషన్ ఆవరణలో జవాబుపత్రాలు
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. వారి నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా ఉంది. ఇటీవల మాయమైన గిరి రాజ్ పీజీ కళాశాల సప్లిమెంటరీ జవాబుపత్రాలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలో లభ్యమయ్యాయి. మంగళవారం సాయంత్రం రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌రైళ్ల సమీపంలో జవాబు పత్రాల బ్యాగు లభించింది. కేవ లం ఇక్కడ నాలుగు జవాబు పత్రాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగితా జవాబు పత్రాలు కనిపించలేదు. 69 జవాబు పత్రాలు బ్యాగులో సీజ్‌చేసి ఉండగా వీటిని దొంగిలించిన వారు రైల్వేస్టేషన్ ఆవరణకు వెళ్లి, బ్యా గును తెరిచి చూశారు. ఇందులో జవాబు పత్రాలు ఉండడంతో నాలుగు పేపర్లను అక్కడే పడేసి, మిగితా పేపర్ల ను దగ్గరలోని దుకాణంలో విక్రయించినట్లు తెలుస్తోం ది. ఈ విషయం తెలిసిన గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది సంఘటన స్థలానికి రాలేదు. గత ఆరో తేదీన మాయమైన జవాబుపత్రాలు రైల్లో నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి తీసుకువెళ్లి ఇందులో పేపర్లు ఉండడంతో అక్కడే పడవేసినట్లు తెలుస్తోంది. -
తనిఖీలతో హడలెత్తించిన జీఎం
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. దాదాపు గంటన్నరపాటు తనిఖీలు చేసి రైల్వే అధికారులను హడలెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముథ్కేడ్ నుంచి నిజామాబాద్ స్టేష న్కు 14 బోగీలు గల ఇన్స్పెక్షన్ ప్రత్యేక రైలులో వ చ్చారు. ఇక్కడి రైల్వే అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రైలు దిగగానే తనిఖీల పర్వం కొనసాగించారు. స్టేషన్‌లోని ఫుడ్ ప్లాజా క్యాంటిన్‌ను, మార్వాడీ యువమంచ్ వారు స్వచ్ఛందంగా నిర్మించిన తాగునీటి కుళాయిల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌ను, సాధారణ ప్రయాణికుల వెయింటింగ్ రూంను, టాయిలెట్లను నిశితంగా పరిశీలించారు. వెయింటింగ్ రూంలో కూర్చున్న ఓ ప్రయాణికుడిని స్టేషన్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో తనిఖీ చేసి బయటకు వచ్చి ప్రయాణికుల రిజర్వేషన్, జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగితెలుసుకున్నా రు. అక్కడి నుంచి స్టేషన్ ఆవరణలో పార్కింగ్ స్థలాన్ని, రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్తోపాటు మొత్తం రైల్వే స్థలం వివరాలను స్టేషన్ మాస్టర్ ప్రభుచరణ్‌ను అడిగితెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఎత్తుపల్లాలు ఉన్న విషయాన్ని కూడా అడిగారు. అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ చాంబర్లోకి వెళ్లారు. అనంతరం డ్రైవర్-క్లీనర్లు, రైల్వే సిబ్బంది ఉండే రన్నింగ్ రూంను, కంబైండ్ క్రూ బుకింగ్ లాబీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడి రైల్వే ఉద్యోగుల మెడికల్ యూనిట్(డిస్పెన్సరీ)ని, రైల్వే క్వార్టర్లను సందర్శించారు. రైల్వే క్వార్టర్లలో నివసిస్తున్న ఉద్యోగ కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు, వసతుల గురించి అడిగితెలుసుకున్నారు. గంటన్నరపాటు జరిగిన తనిఖీలతో రైల్వే అధికారులు ఉరుకులుపరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో రన్నింగ్ రూంలో డ్రైవర్లు, గార్డులు రెస్ట్ విభాగంలో ఏసీ సౌకర్యాన్ని ప్రారంభించారు.