రైల్వేస్టేషన్ ఆవరణలో జవాబుపత్రాలు
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. వారి నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా ఉంది. ఇటీవల మాయమైన గిరి రాజ్ పీజీ కళాశాల సప్లిమెంటరీ జవాబుపత్రాలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలో లభ్యమయ్యాయి. మంగళవారం సాయంత్రం రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌రైళ్ల సమీపంలో జవాబు పత్రాల బ్యాగు లభించింది. కేవ లం ఇక్కడ నాలుగు జవాబు పత్రాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగితా జవాబు పత్రాలు కనిపించలేదు.
69 జవాబు పత్రాలు బ్యాగులో సీజ్‌చేసి ఉండగా వీటిని దొంగిలించిన వారు రైల్వేస్టేషన్ ఆవరణకు వెళ్లి, బ్యా గును తెరిచి చూశారు. ఇందులో జవాబు పత్రాలు ఉండడంతో నాలుగు పేపర్లను అక్కడే పడేసి, మిగితా పేపర్ల ను దగ్గరలోని దుకాణంలో విక్రయించినట్లు తెలుస్తోం ది. ఈ విషయం తెలిసిన గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది సంఘటన స్థలానికి రాలేదు. గత ఆరో తేదీన మాయమైన జవాబుపత్రాలు రైల్లో నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి తీసుకువెళ్లి ఇందులో పేపర్లు ఉండడంతో అక్కడే పడవేసినట్లు తెలుస్తోంది.