చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. దాదాపు గంటన్నరపాటు తనిఖీలు చేసి రైల్వే అధికారులను హడలెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముథ్కేడ్ నుంచి నిజామాబాద్ స్టేష న్‌కు 14 బోగీలు గల ఇన్‌స్పెక్షన్ ప్రత్యేక రైలులో వ చ్చారు. ఇక్కడి రైల్వే అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రైలు దిగగానే తనిఖీల పర్వం కొనసాగించారు. స్టేషన్‌లోని ఫుడ్ ప్లాజా క్యాంటిన్‌ను, మార్వాడీ యువమంచ్ వారు స్వచ్ఛందంగా నిర్మించిన తాగునీటి కుళాయిల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్‌ను, సాధారణ ప్రయాణికుల వెయింటింగ్ రూంను, టాయిలెట్‌లను నిశితంగా పరిశీలించారు. వెయింటింగ్ రూంలో కూర్చున్న ఓ ప్రయాణికుడిని స్టేషన్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లో తనిఖీ చేసి బయటకు వచ్చి ప్రయాణికుల రిజర్వేషన్, జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌లను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రయాణికులతో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగితెలుసుకున్నా రు. అక్కడి నుంచి స్టేషన్ ఆవరణలో పార్కింగ్ స్థలాన్ని, రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్‌తోపాటు మొత్తం రైల్వే స్థలం వివరాలను స్టేషన్ మాస్టర్ ప్రభుచరణ్‌ను అడిగితెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఎత్తుపల్లాలు ఉన్న విషయాన్ని కూడా అడిగారు. అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ చాంబర్‌లోకి వెళ్లారు. అనంతరం డ్రైవర్-క్లీనర్‌లు, రైల్వే సిబ్బంది ఉండే రన్నింగ్ రూంను, కంబైండ్ క్రూ బుకింగ్ లాబీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడి రైల్వే ఉద్యోగుల మెడికల్ యూనిట్(డిస్పెన్సరీ)ని, రైల్వే క్వార్టర్లను సందర్శించారు. రైల్వే క్వార్టర్లలో నివసిస్తున్న ఉద్యోగ కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు, వసతుల గురించి అడిగితెలుసుకున్నారు. గంటన్నరపాటు జరిగిన తనిఖీలతో రైల్వే అధికారులు ఉరుకులుపరుగులు తీశారు. రైల్వేస్టేషన్‌లో రన్నింగ్ రూంలో డ్రైవర్లు, గార్డులు రెస్ట్ విభాగంలో ఏసీ సౌకర్యాన్ని ప్రారంభించారు.
తనిఖీలతో హడలెత్తించిన జీఎం
Published Sat, Jan 18 2014 5:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement