కార్డన్‌ సెర్చ్‌.. 40 వాహనాలు సీజ్ | vehicles seized at Cordon and search in karimnagar | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌.. 40 వాహనాలు సీజ్

Published Wed, Jan 4 2017 9:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

vehicles seized at Cordon and search in karimnagar

కరీంనగర్‌: కరీంనగర్‌ హుస్సేన్‌పురాలో పోలీసులు బుధవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్డన్ సెర్చ్ 9 గంటల సమయంలోనూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 లీటర్ల కిరోసిన్‌(రేషన్‌)ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రామారావుల ఆధ్వర్యంలో పదిమంది సీఐలు, 300మంది పోలీసు సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement