హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కమేళ, మెయిన్ పురా, మిశ్రీ గంజ్ ప్రాంతంలో సౌత్ జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ‍్వర‍్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర‍్వహించారు. ఈ తనిఖీల‍్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు.
అక్రమంగా జంతువుల మాంసం విక్రయిస్తున‍్న 12 కబేళాలపై దాడులు నిర‍్వహించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి మాంసాన్ని పరిశీలించారు. ఈ దాడుల‍్లో 25 మంది అనుమానితులు, సరైన ధ్రువపత్రాలులేని 5 ఆటోలు, 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మత్తుపదార్థాలను 300 రూపాయలకు విక్రయిస్తున‍్న ఓ వ‍్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 25మంది
Published Sat, May 6 2017 7:50 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
Advertisement
Advertisement