![Lockdown Rules Break: Two Vehicles Seized In Karim Nagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/bike.jpg.webp?itok=yAg0AyP9)
కరీంనగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
ఇక్కడ కనిపిస్తున్న ఈ బండ్లు పార్కింగ్ చేసినవి కావు. ఏదో మార్కెట్‌కు వచ్చి నిలిపి ఉంచిన బండ్లయితే అసలే కావు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్న వెహికిల్స్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఉదయం వివిధ కూడళ్లలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
సడలింపు సమయం ఉదయం 10 గంటలు ముగిసి తర్వాత కూడా పలువురు రోడ్లపైకి వచ్చారు. అలా వచ్చిన బండ్లను తనిఖీ చేసి సీజ్ చేశారు. సాయంత్రం వరకు 7,059 కేసులు నమోదు చేయగా.. 2099 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని సీపీ వెల్లడించారు.
- కరీంనగర్‌క్రైం
Comments
Please login to add a commentAdd a comment