karimnagar police
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
సాక్షి, కరీంనగర్: చెవులను రణగొణ ధ్వనులతో ఠారెత్తించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్స్‌ను కరీంనగర్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్స్‌ను పట్టుకున్నారు. ఆయా వాహనాలకు చెందిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. వారి కళ్లముందే రోడ్ రోలర్ తో సైలెన్సర్స్‌ను తొక్కించేసి.. తునాతునుకలుగా ధ్వంసం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా ఫోన్ పోయింది: పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్/ హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫోన్ ఎక్కడుంది? అనేది చర్చనీయాంశమయ్యింది. కలకలం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు అయినప్పటి నుంచి ఆయన ఫోన్ కన్పించకుండా పోయింది. అయితే బెయిల్‌పై విడుదలైన సంజయ్..ఆదివారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు సమయం నుంచి తన వ్యక్తిగత ఫోన్ కన్పించడం లేదని పేర్కొంటూ పట్టణ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని ఎలాగైనా వెదికి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆ ఫోన్ తన సోదరి పేరు మీద ఉందని, భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో తాను ఆమె పేరు మీద ఉన్న సిమ్‌కార్డు వాడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్.. తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించడం గమనార్హం. కాగా రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్..తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అరెస్టు అనంతరం సంజయ్‌ను పోలీసులు బొమ్మల రామారం తీసుకెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్ కనిపించకుండా పోయింది. వరంగల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఫోన్ సాయంతోనే ఏ–2 ప్రశాంత్‌తో సంజయ్ (ఏ–1) పదేపదే సంభాషించారు. ఈ కేసు ఛేదనకు ఎంతో కీలకమైన సాంకేతిక ఆధారం కావడంతో కుట్ర కేసు మొత్తం ఫోన్ చుట్టే తిరుగుతోంది. అయితే ఆ ఫోన్ సంజయ్ సమీప అనుచరుడైన బోయినపల్లి ప్రవీణ్ రావు వద్ద ఉండి ఉంటుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాటరీ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని, చివరిగా అది సిద్దిపేట టవర్ లొకేషన్ చూపించిందని, తప్పనిసరిగా బండి అనుచరులే దాన్ని దాచారని, ఆధారాలు దొరక్కుండా ఇప్పటికే ధ్వంసం చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అది పోలీసుల పనే..: సంజయ్ తన సెల్‌ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తర్వాత మాయం అయ్యిందని పేర్కొన్నారు. మాయం చేసినవారే తనను ఫోన్ అడగడం సిగ్గు చేటన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు ఆదివారం రాత్రి రాష్ట్ర లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సందర్భంగా బండి మాట్లాడారు. కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్ మూర్ఛపోయారు. నా ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడమే ఆయన పని..’అని సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?..’అని ప్రశ్నించారు. నిర్బంధాలు పెరిగే అవకాశం ‘రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందువల్ల లీగల్ సెల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి. మీరున్నారనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి..’అని సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్ తప్పుపట్టారు. ‘ప్రధాని మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టి»ొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు..’అని ధ్వజమెత్తారు. చదవండి: ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బండి సంజయ్ ఫిర్యాదు కాపీ -
ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్‌క్రైం: నగరంలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బాలికను తల్లిఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కుత్బుద్దీన్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కూతురు నిమ్రా ఉంది. చదవండి: పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైంది. స్థానికం గా గాలించినా ఆచూకీ తెలియలేదు. పాప ఆటోలో వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుత్బుద్దీన్ రాత్రి 9.30 గంటలకు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రంయించాడు. ఏసీపీ తుల శ్రీనివాస్ నేతృత్వంలో ఐదు సివిల్, ఒక టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో గంట వ్యవధిలోనే పాపను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ సంతోశ్ ఇంటిని గుర్తించారు. అతని ద్వారా నిమ్రా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమద్ది రాములు ఇంట్లో ఉంచాడని తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పాపను అర్ధరాత్రి దాదాపు 12.45 గంటలకు సురక్షితంగా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, దామోదర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, రహీంపాషా, టీ.మహేశ్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, దేవేందర్, కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్ ఖాన్, రవీందర్, మల్లయ్య, రాజ్‌కిరణ్, బద్రుద్దీన్, మనోహర్‌లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. నిమ్రాను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు మేనమామ అనుకుని ఎక్కిన నిమ్రా సోమవారం రాత్రి 7 గంటలకు అశోక్‌నగర్ ఉండే ఆటోడ్రైవర్ సంతోశ్ వద్దకు ఇద్దరుమహిళలు వచ్చి బీబీఆర్ ఆసుపత్రి వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వారిది చిన్నగల్లీ కావడంతో ఆటో వెళ్లలేదు. రాత్రి 7.25కి ఆటో(టీఎస్ 02యూసీ 3079)ను కుత్బుద్దీన్ ఇంటి ఎదుట నిలిపాడు. బయట ఆడుకుంటున్న నిమ్రా తన మేనమామ ఆటో అనుకుని ఎక్కింది. సంతోశ్ పక్కనే కూర్చుంది. మద్యంమత్తు లో ఉన్న అతనూ చిన్నారి నిమ్రాను వారించలేదు. ఈలోపు మహిళలురాగానే వారిని బీబీఆర్ ఆసుపత్రి వద్ద దించాడు. తరువాత అతనిలో పాపను అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమ ద్ది రాములుకు పాపను అప్పగించాడు. తెల్లవారి పాపను ఎంతోకొంతకు విక్రయించాలని ఇద్దరూ కలిసి అనుకున్నారుు. ఏమీ తెలియనట్లుగా రాత్రి 11.30 గంటలకు సంతోశ్ తిరిగి ఇల్లు చేరాడు. అప్పటికే కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం విషయం కక్కేశాడు. వన్‌టౌన్ పోలీసులు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేరాత్రి ఖాజీపూర్‌లోని రాములు ఇంటిని చుట్టుముట్టారు. రాత్రి 12.45 గంటలకు ఏసీపీ తుల శ్రీనివాస్, సీఐ నటేశ్, ఎస్సై శ్రీనివాస్‌లు పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్టిక్కర్ పీకేసిన సంతోశ్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నగరంలో ఆటోలపై స్టిక్కర్లు వేశారు. బీబీఆర్ ఆస్పత్రి వద్ద మహిళలను దించిన సమయంలోనూ సంతోశ్ ఆటోపై స్టిక్కర్ ఉంది. పాపను రాములుకు అప్పగించిన తరువాత స్టిక్కర్‌ను తొలగించాడు. ఆటో నంబరు సరిపోలినా.. వెనక స్టిక్కర్ లేదు. కానీ, స్టిక్కర్ తీసేసిన ప్రాంతం జిగటగా ఉండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదే ఆటో అని నిర్ధారించుకుని సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిమ్రా అదృశ్యమవగానే.. పాప చిత్రం, వివరాలతో పలు మెసేజ్‌లు నగరంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరలయ్యాయి. దీంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా గాలించారు. పాప ఆచూకీ చిక్కిన సమయంలోనూ వీరంతా పోలీసుల వెంటే ఉండటం గమనార్హం -
హుజురాబాద్: తుపాకులు అప్పగించాలె.. లేదంటే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో లైసెన్స్ తుపాకులపై పోలీసులు దృష్టిపెట్టారు. లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాలచట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేస్తారు. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ స్పష్టంచేశారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి నవంబరు 6వ తేదీన తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయబ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతాసిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వివరించారు. కమిషరేట్ పరిధిలో 101 లైసెన్స్డ్ తుపాకులు ఉండగా అందులో 73 తుపాకులు వ్యక్తిగతమైనవి కాగా.. మిగిలిన 28 గన్స్ భద్రతాసిబ్బంది వద్ద ఉన్నాయి. చదవండి: హుజురాబాద్.. ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు -
ఇవి పార్కింగ్‌లో పెట్టిన బండ్లు కావు..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బండ్లు పార్కింగ్ చేసినవి కావు. ఏదో మార్కెట్‌కు వచ్చి నిలిపి ఉంచిన బండ్లయితే అసలే కావు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్న వెహికిల్స్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఉదయం వివిధ కూడళ్లలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సడలింపు సమయం ఉదయం 10 గంటలు ముగిసి తర్వాత కూడా పలువురు రోడ్లపైకి వచ్చారు. అలా వచ్చిన బండ్లను తనిఖీ చేసి సీజ్ చేశారు. సాయంత్రం వరకు 7,059 కేసులు నమోదు చేయగా.. 2099 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని సీపీ వెల్లడించారు. - కరీంనగర్‌క్రైం -
టీఆర్ఎస్, బీజేపీ నేతల లొల్లి; కిందపడ్డ సీఐ
కరీంనగర్ క్రైం/ కరీంనగర్ టౌన్: కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్ వేదికగా కొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం అందించారు. సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి. లొల్లి ముదిరిందిలా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు. పోలీసుల అదుపులో ఇరువర్గాలు.. పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. బీజేపీ నేతలపై కేసు.. తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు. -
ఆపత్కాలంలో దేవునిలా..
గోదావరిఖని(రామగుండం): ప్రాణాపాయ స్థితిలో కిడ్నీ మార్చుకున్న ఓ నిరుపేద మహిళకు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించి దేవునిలా నిలిచారు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు. మంగళవారం రామగుండం పోలీస్‌కమిషనర్ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన కాళేశ్వరం రజిత కిడ్నీ మార్చుకుంది. ఇన్ఫెక్షన్ కాకుండా నిత్యం మందులు వాడటం తప్పనిగా మారింది. లాక్డౌన్ కారణంతో మందులు తెచ్చుకోలేక పోయింది. గతనెలాఖరుతో మందులు పూర్తిగా అయిపోయాయి. అయితే లాక్డౌన్ ఉండటంతో మందులు లేకుండానే రోజులు వెళ్లదీస్తూ వస్తోంది. దీంతో కడుపు వాపు రావడంతో మందుల కొనుగోలు తప్పనిసరైంది. అయితే మందులు లాక్డౌన్ కావడంతో హైదరాబాద్‌కు వెళ్లడం కూడా వారికి కష్టంగా మారింది. ఈక్రమంలో మహిళ మూడు రోజుల కిందట తాను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్‌ను కోరింది. ఎలా వెళ్తారని ప్రశ్నించడగా తమకు అనుమతి ఇస్తే ద్విచక్రవాహనంపై వెళ్లి తెచ్చుకుంటామని కన్నీళ్ల పర్యంతమైంది. తన భర్తకు పెద్దగా తెలియదని, ఇద్దరం కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. వీరి పరిస్థితి గమనించిన సీఐ పర్శ రమేష్ తాను టాబ్లెట్లు తెప్పిస్తానని చెప్పి మెడికల్ ఏజెన్సీద్వారా హైదరాబాద్ నుంచి మందులు తెప్పించారు. ఈమేరకు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధిత మహిళకు అందజేయడంతో కన్నీటి పర్యంతమై సీఐ కాళ్లు మొక్కింది. మీరు ఆదుకోకుంటే జీవితం మరింత నరకంగా మారేదని తెలిపింది. కాగా మానవత్వంతో స్పందించి ఓకుటుంబానికి అండగా నిలిచిన వన్‌టౌన్ సీఐ రమేష్‌ను సీపీ సత్యనారాయణ, ఏసీపీ ఉమేందర్ అభినందించారు. -
జనశక్తి నేత నరసింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: జనశక్తి కీలక నేతను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దశాబ్దాలుగా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బొమ్మని నరసింహ (55) అలియాస్ ఆనంద్ అలియాస్ నర్సిరెడ్డి ఉరఫ్ విశ్వనాథ్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన స్వస్థలం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం. ఈ నెల 24న పోలీసులు నరసింహ కోసం ఇంటికి రాగా ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో నే పోలీసులు వచ్చి ఉంటారని తెలిసింది. బషీర్ బాగ్ లో ఆదివారం నరసింహను అరెస్టు చేశారు. పలు కార్యకలాపాల్లో బాధ్యుడిగా నరసింహ రాష్ట్రస్థాయి నేతగా వ్యవహరిస్తోన్న నరసింహ తెలం గాణలో పలు జనశక్తి కార్యకలాపాల్లో బాధ్యుడిగా ఉన్నారు. ఒడిశాలో ఉద్యమంలో ఉన్న సమయంలో ఆదివాసీల కోసం పలు పోరాటాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కటక్ జైల్లో ఏడేళ్లపాటు శిక్ష అనుభవించి 2013లో విడుదలయ్యారు. తెలంగాణలో సెక్రటరీగా పార్టీ కార్యకలాపాలు చూస్తున్నాడు. 2018లో మహబూబాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసింది కరీంనగర్ పోలీసులని, అక్కడ నరసింహకు సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అతని క్షేమంపై కుటుంబ సభ్యులు, ఆయన భార్య బొమ్మని పద్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని ఆయనకు ఏ హానీ తలపెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్హాల్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా దారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున.. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటలలోగా కౌంటింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్‌రూంలు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరువబడుతాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలని అన్నారు. ఏజెంట్ల సెల్ఫోన్లు లోనికి అనుమతించబడవు... ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్ల సెల్ఫోన్లు లెక్కింపు కేంద్రాల్లోనికి అనుమతించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ కేంద్ర వద్ద ఏజెంట్లు సెల్ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ సెల్ఫోన్లను తీసుకురావద్దని సూచించారు. లెక్కింపు కేంద్రాల సందర్శనలో సీపీ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, ఎన్నికల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే తొలి మహిళా కమాండో వింగ్
-
ఉద్యోగాల పేరుతో మోసం
కరీంనగర్ క్రైం: ఉద్యోగాల పేరుతో పలువురిని నమ్మించి, రూ.7 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నారు. ఏసీపీ శోభన్‌కుమార్ సోమవారం కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెల్ధి రాధాకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేయడం ప్రారంభిం చాడు. 320 మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేశాడు. రామారావు, రవి చంద్రారెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, ఈశ్వర వేణుగోపాల్లను అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్, వరంగ ల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్లగొండ, హైదరాబాద్, కర్నూల్, కృష్ణా, పశ్చి మగోదావరి, అనంతపురం జిల్లాలకు చెంది న పలువురు ఇతడి వలలో చిక్కి మోసపోయారు. సెక్రటేరియట్, రెవెన్యూ, కమర్షియ ల్ ట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి ఆపైన వసూ లు చేశాడు. కొందరికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను కూడా ఇచ్చాడు. గుట్టు వీడింది ఇలా.. కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన పైడిపాల వెంకటయ్య తనకు తెలిసిన వారిని రాధాకృష్ణకు పరిచయం చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో వెంకటయ్య రూ. 26 లక్షలు వసూలు చేసి ఇచ్చా డు. రాధాకృష్ణ ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో వెంకటయ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం రాధాకృష్ణను అరెస్టు చేసింది. నాగర్‌కర్నూల్, గోదావరిఖని, నేరేడ్మెట్, అంబర్‌పేట, నల్లగొండ, బహదూర్‌పుర, కరీంనగర్ టుటౌన్, త్రీటౌన్, బేతంచర్ల పోలీస్స్టేషన్లలో రాధాకృష్ణపై పలు కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి చెక్‌బుక్స్, విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి దాడులు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులకు యూనిఫాం, దానిపై పోలీసు పేరు, కోడ్ ఉంటాయని గుర్తు చేసింది. యూనిఫాంను పక్కన పెట్టి సివిల్ డ్రెస్సులో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలున్నా కూడా, వాటిని పట్టించుకోకుండా సివిల్ డ్రెస్సులో వెళ్లి ఓ రిసార్ట్‌లో దాడులు చేయడాన్ని తప్పుపట్టింది. నేరశిక్షాస్మృతి (సీఆర్పీసీ) కంటే పోలీసులు ఉత్తర్వులు గొప్పవి కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పోలీసులకు హితవు పలికింది. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించరాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాడులు చేసిన పోలీసులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదంది. ఈ కేసులో హాజరు కావాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను ఆదేశించింది. తదు పరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమ్మీ చట్టవిరుద్ధం కాద ని హైకోర్టు చెప్పినా పోలీసులు కరీంనగర్‌లోని తమ రిసార్ట్‌పై తరచూ దాడులు చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ పుష్పాంజ లి కంట్రీ రిసార్ట్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపి పుష్పాంజలి కంట్రీ రిసార్ట్‌పై దాడులు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసు లు వైఖరి మార్చుకోకపోవడంపై యాజమాన్యం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. -
హెల్మెట్..హెల్మెట్..!
కరీంనగర్‌బిజినెస్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మ్‌ట్ ధరించాలని గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో కొంత కాలమే అమలయ్యింది. పోలీసులు సైతం పలు మార్లు హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు హెల్మెట్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెల్మెట్ ధరించడంపై ప్రచారం చేపట్టారు. తల మీదే.. రక్షణ మీదే.. హెల్మెట్ ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హెల్మెట్ ఉపయోగపడుతుంది. మెట్రో నగరాల్లో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో కరీంనగర్లో పలుమార్లు అమలు చేసినా అది కొనసాగలేదు. కానీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా హెల్మెట్ వాడాలని కరీంనగర్ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ‘తల మీదే... రక్షణ మీదే...’ నినాదంతో విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. హెల్మెట్లకు ఫుల్ గిరాకీ... పోలీసులు ఫిబ్రవరి 1నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరని సూచించడంతో హెల్మెట్ లేని వాహనదారులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. కొంతమంది ఆన్లైన్లో వివిధ రకాల మోడల్స్ వెతుకుతుండగా, మరికొంత మంది నగరంలోని షాపుల్లో సరికొత్త మోడల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని కమాన్, కోతిరాంపూర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆటోస్టోర్స్ దుకాణాలు సహా బస్టాండ్, కమాన్, తెలంగాణచౌక్, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, కోర్టురోడ్డు, ఎస్సారార్ కాలేజీ రోడ్, ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతాల్లో హెల్మెట్లు అమ్ముతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్, సిరిసిల్ల రోడ్, జగిత్యాల రోడ్డు, గోదావరిఖని రోడ్లలో ప్రత్యేకంగా ఫుట్‌పాత్ దుకాణాలు వెలిశాయి. శుక్రవారం నుంచి హెల్మెట్ యాక్టు అమలు చేస్తుండడంతో గత వారం రోజులుగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని దుకాణాదారులు తెలిపారు. మునుపెన్నడూ లేనివి«ధంగా భారీగా హెల్మెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. సరికొత్త రకాల హెల్మెట్లు... నగరంలోని దుకాణాలు, ఫుట్‌పాత్ షాపుల్లో సాధారణ హెల్మెట్లతో పాటు స్పోర్ట్స్, షార్ట్ హెల్మెట్, ఓపెన్ పేస్ హెల్మెట్, ఫుల్‌ఫేస్ హెల్మెట్, ఫ్లిప్ అప్ హెల్మెట్ వంటి వివిధ రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు హెల్మెట్లు నాణ్యతను బట్టి రూ.350 నుంచి రూ.2000లకు పైగానే లభిస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. ఐఎస్ఐ మార్క్‌తో పాటు నాణ్యమైన హెల్మెట్ వాడితేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో కూడా కరీంనగర్ వాసులు చాలా మంది హెల్మెట్లను ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు గత 15 రోజుల నుంచి సుమారు రూ.కోటి వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ నెల 1వ తేదీ నుంచి కరీంనగర్లో హెల్మెట్ యాక్టు అమలు చేస్తున్నాం. ప్రమాదానికి గురైనప్పుడు ద్విచక్ర వాహనదారులు కిందపడగా ముందుగా తలకే గాయాలవుతాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తల మనదే... రక్షణ మనదే అన్న సంగతి మరువరాదు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గజ్జెల కాంతం
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గజ్జెల కాంతం
సాక్షి, కరీంనరగ్ : కరీంనగర్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు బ్రీత్ అనలైజర్‌లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గజ్జెల కాంతంకు మద్దతుగా కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. పోలీసులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు గజ్జెల కాంతంను అదుపులోకి తీసుకుని కాసేపటికి వదిలి పెట్టారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన గజ్జెల కాంతం -
మాజీ డీఎస్పీ సీసీ సస్పెన్షన్
ఆలస్యంగా వెలుగులోకి కప్పి ఉంచిన అధికారులు కరీంనగర్ క్రైం : కరీంనగర్ డీఎస్పీ సీసీగా పనిచేసిన అబ్దుల్ రజాక్‌ను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వైద్యుడిని తప్పిస్తానని పెద్ద మెుత్తం వసూలు చేసిన ఘటనలో మెుదటి బదిలీ చేసిన తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2015, ఆగస్టులో వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదుతో రెండు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న ఓ వైద్య విద్యార్థిని తప్పించేందుకు కొందరు ఆ సమయంలో కరీంనగర్ డీఎస్పీ సీసీగా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ రజాక్‌ను సంప్రదించారు. వీరి నుంచి రజాక్ సుమారు రూ.3.4 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వన్‌టౌన్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత రజాక్ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగివ్వమనగా.. సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఎస్పీ జోయల్‌డెవిస్ ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం రజాక్‌కు ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. రోజు డబ్బులు తీసుకున్న విషయం రుజువు కావడంతో మరుసటి రోజు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు యత్నించారు. గతంలోనూ కరీంనగర్ డీఎస్పీ రామారావు సీసీగా పనిచేసిన సమ్మయ్య సస్పెన్షన్‌కు గురికాగా ప్రస్తుతం అబ్దుల్ రజాక్‌పై వేటు పడడం గమనార్హం. -
పోలీసుల అదుపులో మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి
హైదరాబాద్: మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నయీం ఎన్కౌంటర్ అనంతరం గత 10 రోజులుగా మోహన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. కాగా, నరహంతకుడు నయీం ముఠాతో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
కరీంనగర్ : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న మఠాగుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ముఠాలోని మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 18 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు, పోలీసులు సంయుక్తంగా గురువారం అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన బాలికకు రామగుండం సుభాష్ నగర్‌కు చెందిన యువకుడితో వివాహ నిశ్చయమైంది. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని నాలుగోవ డివిజన్ సుభాష్ నగర్లో 14 ఏళ్ల బాలికకు వివాహం జరుగుతుందని స్థానికులు... పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచరం అందించారు. దాంతో తహసీల్దార్, ఐసీడీఎస్, పోలీసులు వెంటనే అప్రమత్తమై... సుభాష్ నగర్ చేరుకుని... బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
మహబూబ్పల్లిలో జంట దారుణ హత్య !
మహముత్తారం మండలం మహబూబ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వసంత అనే మహిళను, సురేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. దాంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఆ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కేతన్‌జైన్.. చిక్కడు.. దొరకడు
సిరిసిల్ల వస్త్రవ్యాపారులను నమ్మించి, కోటి రూపాయల వస్త్రంతో ఉడాయించిన గుజరాత్ వ్యాపారి కేతన్‌జైన్ ఇంకా దొరకలేదు. అతడి కోసం పోలీసులు మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు వెళ్లినా లాభం లేకపోయింది. కేతన్ పట్టుబడతాడని ఆశించిన వ్యాపారులు ఈ విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర వెళ్లినాకానరాని ఫలితం అన్వేషణ ఖర్చులు రూ.3.50 లక్షలు వృథా రెంటికీ చెడ్డ రేవడిగా సిరిసిల్ల వస్త్రవ్యాపారులు సిరిసిల్ల : కేతన్ జైన్ తనది ఢిల్లీ అని చెప్పి సిరిసిల్ల వస్త్రవ్యాపారులను నమ్మించాడు. తప్పుడు సమాచారంతో వారి వద్ద నమ్మకంగా ఉన్నాడు. నాలుగు నెలల పాటు డబ్బులు నగదుగా ఇ స్తూ.. వస్త్రాన్ని కొనుగోలు చే శాడు. ఆ తర్వాత పాతిక మంది దగ్గర రూ. కోటి విలువైన వస్త్రా న్ని ఉద్దెరగా తీసుకుని ఉడాయించాడు. బాధిత వ్యాపారులు ఫిర్యాదు చేయగా నవంబరు 20న పోలీసులు కేసు నమోదుచేశారు. అతడి ఫోన్ నంబర్ల 9705632772, 8008601447 ఆధారం గా జైన్‌ది రాజస్థాన్‌లోని జోధ్పూర్గా గుర్తిం చారు. వ్యాపారులను వెంట తీసుకుని పోలీ సులు అక్కడికి వెళ్లారు. కేతన్ సొంత ఇంటిని, అతడి పిల్లలు చదువుకునే స్కూల్‌ను సైతం గు ర్తించారు. దీంతో ఇక కేతన్ దొరికినట్లేనని భావించి టౌన్ సీఐ నాగేంద్రాచారి, మరో టీఆర్ఎస్ నాయకుడు అక్కడికి వెళ్లారు. కానీ అతడు దొరకలేదు. పది రోజుల పాటు అక్కడే ఉండి గాలించినా జైన్ చిక్కక పోవడంతో పోలీసులు, వ్యాపారులు నిరాశచెందారు. రెండింటికీ చెడ్డారు.. పోలీసులు కేతన్‌జైన్ అన్వేషణలో రూ. 3.50లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని బాధిత వ్యాపారుల వద్ద వసూలు చేసినట్లు తెలిసింది. అటు కేతన్ దొరక్కపో గా.. అతని వేట పేరిట పోలీసులు రూ.3.50లక్షల మేర ఖర్చులు చూపడం వస్త్రవ్యాపారులను ఆందోళన కు గురిచేస్తోంది. కేతన్ చిక్కితే.. కొంతైనా డబ్బులు వస్తాయనే ఆశతో వ్యాపారులు పోలీసులకు సహకరించినట్లు సమాచారం. 45 రోజులుగా కేసు పురోగతి లేక.. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా తీవ్ర ప్రభావం.. సిరిసిల్ల వస్త్ర వ్యాపారంలో నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తుంటారు. గుడ్డను అరువుపై తీసుకుని వారం, పది రోజుల్లో డబ్బు లు తిరిగి ఇవ్వడం ఇక్కడ పరిపాటి. కానీ కేతన్‌జైన్ సంఘటన నేపథ్యంలో ఉద్దెర నమ్మేందుకు వ్యాపారులు వెనకంజ వేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చేతులెత్తేస్తారో అన్న భయంతో ఉన్నా రు. ఫలితంగా నమ్మకం పంచన సాగే వ్యా పారం స్వరూపం ఒక వంచన కారణంగా మొత్తంగా మారిపోయింది. పోలీసులు కేతన్జైన్ను పట్టుకుంటే.. కాస్తయినా వ్యాపారులకు నమ్మకం కలిగేది. కానీ అతడు దొరకలేదు. ఈ సంఘటన కారణంగా నష్టపోయిన వ్యాపారు లు దిక్కులు చూస్తుండగా.. నమ్మకంగా వ్యాపా రం చేసే వారు ఉద్దెర ఇచ్చే వారు లేక ఇబ్బం దులు పడుతున్నారు.