సాక్షి, హైదరాబాద్: పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి దాడులు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులకు యూనిఫాం, దానిపై పోలీసు పేరు, కోడ్ ఉంటాయని గుర్తు చేసింది. యూనిఫాంను పక్కన పెట్టి సివిల్ డ్రెస్సులో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలున్నా కూడా, వాటిని పట్టించుకోకుండా సివిల్ డ్రెస్సులో వెళ్లి ఓ రిసార్ట్‌లో దాడులు చేయడాన్ని తప్పుపట్టింది. నేరశిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) కంటే పోలీసులు ఉత్తర్వులు గొప్పవి కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పోలీసులకు హితవు పలికింది. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించరాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాడులు చేసిన పోలీసులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదంది.
ఈ కేసులో హాజరు కావాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను ఆదేశించింది. తదు పరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమ్మీ చట్టవిరుద్ధం కాద ని హైకోర్టు చెప్పినా పోలీసులు కరీంనగర్‌లోని తమ రిసార్ట్‌పై తరచూ దాడులు చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ పుష్పాంజ లి కంట్రీ రిసార్ట్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపి పుష్పాంజలి కంట్రీ రిసార్ట్‌పై దాడులు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసు లు వైఖరి మార్చుకోకపోవడంపై యాజమాన్యం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు.
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Published Sat, Feb 2 2019 2:14 AM | Last Updated on Sat, Feb 2 2019 1:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment