
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో లైసెన్స్ తుపాకులపై పోలీసులు దృష్టిపెట్టారు. లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాలచట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేస్తారు.
చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ స్పష్టంచేశారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి నవంబరు 6వ తేదీన తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయబ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతాసిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వివరించారు. కమిషరేట్ పరిధిలో 101 లైసెన్స్‌డ్ తుపాకులు ఉండగా అందులో 73 తుపాకులు వ్యక్తిగతమైనవి కాగా.. మిగిలిన 28 గన్స్ భద్రతాసిబ్బంది వద్ద ఉన్నాయి.
చదవండి: హుజురాబాద్.. ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు
Comments
Please login to add a commentAdd a comment